పగిలిన ఫోన్లు వాడుతున్నారా? అయితే పేలడం ఖాయం..

ఇక చాలా మంది కూడా స్క్రీన్ పగిలిన ఫోన్లను అలాగే వాడేస్తుంటారు.అలాగే ఫోన్ పాడైతే రిపేరింగ్‌కు చాలా బద్ధకిస్తుంటారు. ఇలా స్మార్ట్ ఫోన్లను వాడకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు.ఇక దానికి ప్రధాన కారణం ఏమిటంటే..అలా పగిలిన దగ్గర నుంచి నీరు లేదంటే చెమట ఫోన్‌ లోపలికి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమట. ఇక దానివల్ల కూడా బ్యాటరీ అలాగే లోపలి భాగాలు పనిచేయకపోవచ్చు. ఇక అలాంటప్పుడు స్మార్ట్ ఫోన్‌పై ఒత్తిడి పెరిగి మంటలు బాగా చెలరేగి.. ఫోన్ పేలిపోయే అవకాశం పుష్కాలంగా ఉంది. కాబట్టి, స్మార్ట్ ఫోన్ పాడై పోయిన వెంటనే దాన్ని రిపేర్‌ చేయించడం చాలా మంచిది.ఇక అంతేకాదు స్క్రీన్ గార్డ్‌కు క్రాక్స్‌ వచ్చినా వెంటనే మార్చేయడం చాలా మంచిది. అలాగే కరోనా వైరస్ వల్ల ఈ మధ్య శానిటైజర్‌లను స్మార్ట్ ఫోన్లకు సైతం వాడేస్తున్నారు కొంతమంది. అయితే ఛార్జింగ్‌ సాకెట్‌ల ద్వారా కూడా లిక్విడ్‌ లోపలికి వెళ్లి.. ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి టిష్యూస్‌తో దాన్ని చాలా జాగ్రత్తగా తుడవడం చాలా మంచిది అని సూచించడం జరిగింది.

ఇక అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. స్మార్ట్ ఫోన్లలో చాలా వరకూ కూడా వీటితోనే పని చేస్తున్నాయి. బ్యాటరీలు, ఛార్జింగ్ వైర్లు ఇంకా అలాగే అడాప్టర్లను స్పెషల్‌ టెక్నాలజీతో తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. కాబట్టి, తక్కువ ధరలో మార్కెట్లో దొరికే డుప్లికేట్‌ ఛార్జర్లు ఇంకా బ్యాటరీలు వాడకపోవడం చాలా మంచిది. ఇక అలాగే ఇతరుల స్మార్ట్ ఫోన్‌ల ఛార్జర్‌లను(వేరే కంపెనీలవి) సైతం అత్యవసర సమయంలోనే వాడాలని టెక్ నిపుణులు చెప్తున్నారు. డుప్లికేట్‌ ఛార్జర్లను వాడటం వల్ల స్మార్ట్ ఫోన్ బ్యాటరీ వేడెక్కి కొన్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం చాలానే వుంది. అందుకే ఎప్పుడూ కూడా స్మార్ట్ ఫోన్‌లో బ్యాటరీ ఛేంజ్‌ చేసేప్పుడు కంపెనీ సూచించిన బ్యాటరీనే ఉపయోగించడం చాలా మంచిది.అలాగే వెహికిల్స్‌లో ఛార్జింగ్ పెట్టేందుకు ఉపయోగించే పవర్‌ కేబుల్స్‌ ఇంకా పవర్‌ బ్యాంక్‌లను ఇంట్లో పవర్ ప్లగ్‌ నుంచి స్మార్ట్ ఫోన్‌ని ఛార్జ్‌ చేసేందుకు వాడుతూ ఉంటారు. కానీ, పవర్‌ సప్లైలో కూడా తేడా ఉంటుందనే విషయం, ఆ కేబుల్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ఇక వాటితో స్మార్ట్ ఫోన్‌లు డ్యామేజ్‌ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని గుర్తించాలి. ఇక వీటితో పాటు కాస్ట్‌లీ ఫోన్‌లలో సమస్య వచ్చినప్పుడు ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్‌లలో రిపేర్‌ చేయించడం చాలా మంచిది. పైగా స్మార్ట్ ఫోన్‌లో కంపెనీ యాక్ససరీలు కాకుండా థర్డ్‌ పార్టీ యాక్ససరీలు వాడటం వల్ల స్మార్ట్ ఫోన్‌పై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: