"ఫోన్ పే" ఎక్కువగా వాడుతున్న రాష్ట్రము ఏదో తెలుసా ?

VAMSI
కరోనా ఈ ప్రపంచంలో ఉన్న అందరి బ్రతుకులను మార్చేసింది. ఎంతలా అంటే మనము ఇంటి నుండి బయటకు వెళ్లకుండా అన్ని పనులను చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయాము. ఏ చిన్న వస్తువు కొనాలన్నా ఆన్లైన్ షాపింగ్ లోనే, అయితే ఇలా కొనాలంటే మనము డబ్బులు పే చెయ్యాలి కదా... అమౌంట్ ను మాత్రం అందరూ ఇప్పుడు యుపిఐ పద్దతిలో పే చేయడం అలవాటు చేసుకున్నారు. యుపిఐ అంటే ఏదో కాదు...మనము మొబైల్ లో వాడుతున్న ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, పే టిఎమ్, ఇలా ఎన్నో రకాల మనీ ట్రాన్స్ఫర్ యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పక్కకు వెళ్లి ఒక చిన్న టీ తాగినా ఫోన్ పే చేసేస్తున్నాము. చిల్లర గొడవ లేకుండా అంత హ్యాపీ గా ఈ సేవలను అనుభవిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం వినియోగంలో ఇన్ని యాప్ లు ఉన్నా కూడా "ఫోన్ పే" యాప్ నే అధికంగా వాడుతున్నట్లు "ఫోన్ పే" యాజమాన్యం తెలిపింది. అయితే ఎవ్వరైనా ఇన్ని యాప్ లు అందుబాటులో ఉన్నా ఎక్కువగా ఫోన్ పే ను వాడుతున్నారంటే, సర్వీస్, రక్షణ ఇవన్నీ బాగా నచ్చి ఉండడం వల్లనే అని వేరే చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న కస్టమర్ల మదిలో ఉంది. మన ఇండియాలో అత్యధికంగా ఫోన్ పే యూజర్లు ఉన్న రాష్ట్రము ఏదో అని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు.
ఇటీవల ఫోన్ పే తెలిపిన సమాచారం ప్రకారం ఫోన్ పే ను వాడుతున్న కస్టమర్ల సంఖ్య కర్ణాటకలో ఎక్కువ అని అధికారికంగా తెలిపారు. తరువాత స్థానాలలో వరుసగా మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. మహమ్మారి కరోనా వైరస్ వచ్చిన తర్వాత "ఫోన్ పే" కస్టమర్ ల సంఖ్య 100 శాతం మరియు ట్రాన్సాక్షన్ ల సంఖ్య 150 శాతం పెరిగినట్లు చెబుతున్నారు. కాగా అందరూ ఈ యాప్ నే విరివిగా వాడుతున్నారు. దీని వలన ఇప్పుడు చాలా సులభంగా ఇంటి అద్దె, కరెంట్ బిల్, డిష్ బిల్, ఇంటర్ నెట్ బిల్ పలు వాటిని కడుతున్నారు. . 



   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: