వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజెస్ ను చదవడం ఎలా ?

VAMSI
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక యాప్ లను విరివిగా ఉపయోగిస్తున్నారు. వాటిలో దాదాపుగా ప్రతి ఒక్కరూ ఉపయోగించే మొబైల్ యాప్ వాట్సాప్ అని చెప్పాలి. చాలా మందికి వాట్సాప్ లో కొన్ని సందేహాలున్నాయి. మరియు వాట్సాప్ ను ఆపరేట్ చేసే సమయంలో తమ స్నేహితులు లేదా ఇతరులు వారికి పంపిన కొన్ని మెసేజ్ లను కొన్ని కారణాల వలన డిలీట్ చేస్తూ ఉంటారు. అయితే ఇంతకు ముందు వరకు ఆ మెసేజ్ లను తెలుసుకునే అవకాశం లేదు. కానీ ఇపుడు వాట్సాప్ వారు తెచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా వారు డిలీట్ చేసిన మెసేజ్ లను సైతం మనము చూడవచ్చని తెలుస్తోంది. అంతే కాకుండా వాట్సాప్ నుండి డిలీట్ చేసిన ఫైల్స్ ను పొందగలమని తెలుస్తోంది. మరి ఏ విధంగా చేస్తే డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందగలమో ఇప్పుడు తెలుసుకుందాము.
వాట్సాప్ ఇప్పటికే తెచ్చిన ఫీచర్ వలన మనము వేరొకరికి లేదా వారు మనకు పంపిన మెసేజ్ ను ఒక గంట సమయం లోపు మాత్రమే డిలీట్ చేయగలము. అంతకు మించితే ఆ మెసేజ్ డిలీట్ కాదు. కానీ ఇప్పుడు మనము పంపిన మెసేజ్ ను డిలీట్ చేసినా,  అవతలివారు డిలీట్ చేసిన మెసేజ్ ను చూడొచ్చని తెలుస్తోంది. WAMR అనే ఒక యాప్ ను ఉపయోగించి ఇది సాధ్యపడుతుంది. ఆ యాప్ వలన స్టేటస్ వీడియోలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.  ముందు మీరు ఈ WAMR యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుకుని ఇన్స్టాల్ చేసుకోండి.   మీరు ఏ యాప్ ల నుండి అయితే నోటిఫికెషన్స్ పొందాలి అనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు వాట్సాప్, టెలిగ్రామ్ మరియు ఇంస్టా గ్రామ్. దీని తరువాత యాప్ మిమ్మల్ని కొన్ని పెర్మిషన్స్ అడుగుతుంది. వాటన్నింటినీ మీరు అనుమతించండి.

ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మీరు ఆ యాప్స్ నుండి నోటిఫికేషన్ పొందగలరు. ఒకవేళ మీకు ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ముందుగానే ఎందుకున్నట్లయితే ఆ వీడియోలను కూడా పొందగలరు. ఒక్కసారి WAMR స్టార్ట్ చేసిన తరువాత మీ వాట్సాప్ మరియు మీరు ఎంచుకున్న మిగతా యాప్ లకు సంబంధించి డిలీట్ అయినా మెసేజ్ లు అన్నీ WAMR యాప్ విండోలో కనిపిస్తాయి. ఈ డిలీట్ కాబడిన మెసేజ్ లను తిరిగి పొందడానికి మీరు WAMR నోటిఫికేషన్ కు అనుమతి ఇవ్వాలి. ఈ విధంగా ఎవరైనా మీకు పంపిన మెసేజ్ ను డిలీట్ చేసినా WAMR యాప్ ద్వారా నోటిఫికేషన్ లను కాప్చర్ చేసి చూపిస్తుంది. ఇలా మీరు డిలీట్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను కూడా పొందడం వీలవుతుంది. కానీ ఇందుకోసం మీ ఫోన్ లో ఆటోమాటిక్ మీడియా డౌన్లోడ్ ను ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే మీరు ముందుగా ఇన్కమింగ్ నోటిఫికేషన్ లకు అనుమతివ్వాలి. ఇలా నోటిఫై చేయబడిన మెసేజ్ లను మాత్రమే WAMR తిరిగి పొందగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: