వన్ ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫ్రీ అంటున్న కంపెనీ..!
ఎల్ఈ అంటే లిటరల్లీ ఓన్లీ వన్ ఎడిషన్ అని వన్ ప్లస్ తెలిపింది. అంటే మిగతా లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ల లాగా కాకుండా.. వన్ ప్లన్ నార్డ్ ఎల్ఈని కొంతమంది పొందలేదు..అయితే ఈ ఫోన్ ఒకరికి మాత్రమే సొంతం అవుతుంది.గివ్ అవే లాగా ఇచ్చేయాలని వన్ ప్లస్ నిర్ణయించింది.వన్ ప్లస్ నార్డ్ ఎల్ఈని కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ ఆండీ లియు ఫోరం పోస్ట్ ద్వారా ప్రకటించింది. వెనకవైపు నాలుగు కెమెరాలు, వార్ప్ చార్జ్ 30టీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి..
వన్ ప్లస్ ఫోన్లు మాదిరి కాకుండా ఫోన్ వేర్వేరు గ్రేడియంట్ కలర్లలో రానుంది. ఆరెంజ్ నుంచి గ్రీన్‌కు మారేలా కలర్ ట్రాన్సిషన్లను ఈ ఫోన్‌లో అందించారు. దీంతోపాటు ఇందులో స్మూత్ ఫినిషింగ్‌ను అందించారు. వన్ ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే ఓనిక్స్ రంగుల్లో అందుబాటులో ఉంది.వన్ ప్లస్ నార్డ్ ఎల్ఈకి కంపెనీ ఎటువంటి ధరనూ నిర్ణయించలేదు. ఈ ఫోన్‌ను కంపెనీ ఉచితంగా ఇచ్చేస్తుంది. దీన్ని పొందాలంటే మీరు ఇన్‌స్టాగ్రాంలో వన్ ప్లస్ నార్డ్ అధికారిక ఖాతాను ఫాలో అవ్వాలి. మీరు ప్రస్తుతం ఉపయోగించచే స్మార్ట్ ఫోన్‌తో ఒక ఫొటో తీసుకుని క్యాప్షన్‌లో #SwitchToNord హ్యాష్‌టాగ్‌తో ఒక పోస్ట్ చేయాలి.
ఆ తర్వాత లక్కు దేవత ఎవరి తలుపు తడితే వారికే ఆ ఫోన్ సొంతం అవుతుంది. గివ్ అవేలో కేవలం ఒక్క వన్ ప్లస్ నార్డ్ ఎల్ఈ యూనిటే ఉండనుంది. కాబట్టి వన్ ప్లస్ ఫ్యాన్స్‌కు దీన్ని దక్కించుకోవడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. త్వరలో వన్ ప్లస్ నార్డ్ 2 కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.. వాటి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.