వాట్సాప్ లో కొత్త ఫీచర్...తెరవాలంటే వేలి ముద్ర పెట్టాల్సిందే
ఈ అప్డేట్ తో వినియోగదారుల భద్రత మరింత పెరుగుతుంది. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్ టాప్ యాప్ లో వాట్సాప్ ఖాతాను తెరిచేందుకు మరింత సెక్యూరిటీని పెంచింది. యూజర్లు కంప్యూటర్..లేదా వెబ్ యాప్ లో తమ వాట్సాప్ ను ఓపెన్ చేసే ముందు ఫేస్ అన్లాక్..లేదా ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ నిజానికి ఎప్పుడో తీసుకురావాల్సింది. కానీ కొంచం లేట్ గానే తిఆకువచ్చింది. ఫీచర్ ద్వారా ఇతరులు మన అనుమతి లేకుండా మన ఖాతాను ఓపెన్ చేయరాదు. ఎవరైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా మన వేలి ముద్ర..లేదంటే ఫేస్ అన్లాక్ చేయకుండా మన ఖాతాను తెరవలేరు. యూజర్ల మొబైల్ ఫోన్ లలో ఉన్న డేటాను బద్రంగా ఉంచడానికి ఈ ఫీచర్ ను తీసుకువస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉందని...త్వరలోనే అందుబాటులోకి తీసుకెవస్తామని వాట్సాప్ వెల్లడింది. మొత్తానికి వాట్సాప్ ముందు భయపెట్టి ఇప్పుడు బతిమాలినట్టు చేస్తోంది.