గుడ్ న్యూస్: సూపర్ ఫీచర్స్ తో మార్కెట్లోకి రానున్న ఇన్ఫినిక్స్ హాట్-10..!
ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే నాలుగు కెమెరాలు ఉంటాయని తెలియజేశారు. ఇక ఈ ఫోన్ లో 6 జిబి రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉందని తెలిపారు. ఇక అక్టోబర్16 నుంచి ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ ఫోన్ కి దీని రూ.9999.ఇన్ఫినిక్స్ హాట్-10 స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే 6.78 అంగుళాల HD+ డిస్ప్ ప్లే ఉందని తెలిపారు. అంతేకాదు ఎస్పెక్ట్ రేషియో 20.5:9. మీడియా టెక్ హీలియో G70 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుందని తెలిపారు.
ఈ ఫోన్ గేమింగ్ కోసం ఉపయోగపడే విధంగా దీంట్లో హైపర్ ఇంజిన్ గేమ్ టెక్నాలజీ లభిస్తుందని తెలిపారు. ఇన్ఫినిక్స్ హాట్-10 కెమెరాల విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో కెమెరాల కోసం ప్రత్యేకంగా అమరిక ఉంటుంది. దీంట్లో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి. ఇంత తక్కువ ధర ఫోన్ లో నాలుగు కెమెరాలు ఉండటం విశేషం. వీటిలో ప్రైమరీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే 16 మెగా పిక్సల్ సెన్సార్. ఇది f/1.85 apertureని అందిస్తుంది. ఇక మాక్రో కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు కూడా ఉంటాయని తెలిపారు. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా f/2.0 apertureతో అందిస్తున్నారు. డిటిఎస్ ఆడియో సపోర్ట్, సూపర్ నైట్ మోడ్ వంటి ఇతర సదుపాయాలు ఇన్ఫినిక్స్ హాట్-10 లో ఉన్నాయని తెలిపారు.