బుల్లిపిట్ట: ఇక నుండి వాట్సాప్ లో 138 కొత్త ఎమోజీలు....!
వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo ఆండ్రాయిడ్ కోసం వాట్సప్ వెర్షన్ 2.20.197.6 తీసుకొస్తున్నారు. వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్ ను విడుదల చేసిన కొద్ది రోజులకే కొత్త ఎమోజీలని తీసుకు రాబోతున్నారు. సాధారణ స్టిక్కర్స్ తో పాటు యానిమేటెడ్ స్టిక్కర్స్ కూడా అందుబాటు లో ఉన్నాయి. అయితే వీటిని అందించడానికి కారణం ఏమిటంటే..? మెరుగైన కమ్యూనికేషన్ కోసమే. ఇప్పటికే వాట్సాప్ లో అనేక ఎమోజీలు ఉన్నాయి. వీటితో పాటు సరి కొత్తవి వస్తే ఇవి భావాలను, భావోద్వేగాలను వ్యక్త పరచడానికి, యూజర్లని అలరించడానికి ఉపయోగించవచ్చు.
ఇప్పటికే చాలా ఎమోజీలు ఉన్నా సరికొత్త ఎమోజీస్ వీటికి కొంచెం భిన్నంగా ఉంటాయి. కొత్త రంగు , న్యూ హెయిర్ స్టైల్, స్కిన్ టోన్ తో సహా మార్పులు దీనిలో ఉన్నాయి. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం లో చేరిన తర్వాత తాజా వెర్షన్ ను డౌన్ లోడ్ చేయడం ద్వారా కొత్త మార్పులను కూడా చూడవచ్చు . అనేక ఎమోజీలు ఇప్పటికే వాట్సాప్ లో ఉన్నా...... ఇప్పుడు రాబోయే మాత్రం కొంచెం స్పెషల్. రూపు నుంచి రంగు వరకు అన్నీ భిన్నంగా ఉన్నాయి అని చెప్తున్నారు. గత నెలలో వాట్సాప్ ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు యానిమేటెడ్ స్టిక్కర్లు తీసుకొచ్చింది. యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్ జాబితాలో రికోస్ స్వీట్ లైఫ్, ప్లేఫుల్ పియోమారు, బ్రైట్ డేస్, మూడీ ఫుడీస్, చమ్మీ చుమ్ చుమ్స్ వంటివి ఉన్నాయి.