ఎండల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్‌కు సమ్మర్ హాలిడేస్!
నిబంధనలు మీరితే.. స్కూల్ యాజమాన్యాలకు చుక్కలే!
సెలవుల పేరుతో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు (Special Classes) నిర్వహిస్తామని చూస్తే, సదరు పాఠశాలలపై ఉక్కుపాదం మోపుతామని విద్యాశాఖ గట్టి హెచ్చరిక జారీ చేసింది. సెలవుల్లో ఏ రూపంలోనూ తరగతులు నిర్వహించకూడదు.ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ క్లాసులు రన్ చేస్తే ఆ పాఠశాలల గుర్తింపు రద్దు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. అధికారుల తనిఖీలు కూడా ముమ్మరం కానున్నాయి.
తల్లిదండ్రులకు స్పెషల్ అడ్వైజరీ.. పిల్లలే మన ప్రాణం!
ఎండల తీవ్రత విపరీతంగా ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ సూచించింది.ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలను బయటికి పంపవద్దని కోరింది. వేసవిలో ఈత కోసం పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. పిల్లలకు సరిపడా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి అందిస్తూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి.
మళ్ళీ ఎప్పుడు తెరుస్తారంటే?
విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం జూన్ 12వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉంటాయి. జూన్ 13 నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు చిన్నారులంతా పుస్తకాలకు కాస్త విరామం ఇచ్చి, ఇళ్లలోనే సురక్షితంగా వేసవిని ఎంజాయ్ చేయవచ్చు.పిల్లల భద్రతే మా ప్రాధాన్యత అని విద్యాశాఖ చాటిచెప్పింది. స్కూల్ యాజమాన్యాలు అతిగా ప్రవర్తిస్తే లైసెన్స్‌లు కట్ అవ్వడం ఖాయం. పేరెంట్స్ అలర్ట్‌గా ఉండండి.. ఈ వేసవిని మన చిన్నారులకు హాయిగా మార్చుదాం!