బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన దురంధర్ 2..!

Divya
బాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ధురంధర్ 2. మార్చి 19న పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యింది. రణ్ వీర్ సింగ్, సారా అర్జున్, మాధవన్, అక్షయ్ ఖన్నా తదితర నటి నటులు కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా బాహుబలి 2 రికార్డులను తిరగరాసింది. బాహుబలి 2 రూ. 1810 కోట్ల రూపాయలు వసూలు చేసిన సంగతి తెలిసిందే,ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొడుతూ రూ. 1812 కోట్ల రూపాయలను రాబట్టింది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో 2000 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టేలా కనిపిస్తోంది.


ప్రస్తుతం రూ.2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో దంగల్  టాప్ ప్లేస్ లో ఉండగా, ఈ తరుణంలోనే ఇండియన్ హిస్టరీ లోనే  అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ చిత్రంగా ధురంధర్2 ఉన్నది. ఇప్పటికి థియేటర్లలో ఇంకా కొనసాగుతూనే ఉండడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను ఇంకా తిరగరాస్తుందో చూడాలి మరి.ఈ సినిమాకి ఎక్కువగా చైనాలో కలెక్షన్స్ వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. బాహుబలి 2 సినిమా తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి రూ.1300 కోట్ల రూపాయల రాబట్టి నాలుగో స్థానంలో నిలిచింది.



ఒక ఇండియన్ ఏజెంట్ పాకిస్తాన్ కి వెళ్లి అక్కడ చేసిన విధ్వంసం ఏంటి అనేది ఈ సినిమా కథ. అంతేకాకుండా ఈ చిత్రంలో కొన్ని రియల్ లైఫ్ లో జరిగిన పాకిస్తాన్, ఇండియాకి సంబంధించిన కొన్ని సంఘటనల ఆధారంగా స్పైయాక్షన్ థ్రిల్లర్ గా చూపించారు. గత ఏడాది డిసెంబర్ 5న హిందీ భాషలో మాత్రమే విడుదలైన దురంధర్ రూ .500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్ 3 కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా మాత్రం చిత్ర బృందం ఎక్కడ ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: