కాఫీ షాప్స్‌లో సీక్రెట్స్ గీతా మాధురి కామెంట్స్ వైరల్!
గీతా మాధురి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా అరుదుగా కాఫీ షాపులకు వెళ్తానని చెబుతూనే, అక్కడ తాను చూసే విషయాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. “నేను అరుదుగా వెళ్ళినా అక్కడ కొన్ని ప్రేమ జంటలు కనిపిస్తుంటాయి. నేను గనుక నోరు తెరిచి ఆ విషయాలు చెబితే, చాలామంది రిలేషన్ షిప్స్‌కు ఎండ్ కార్డ్ పడిపోతుంది” అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు సినీ వర్గాల్లో ‘ఆ జంటలు ఎవరు?’ అనే చర్చ మొదలైంది.
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సెలబ్రిటీలు ఎక్కువగా తిరుగుతుంటారు. అక్కడ మీడియా కళ్లు, అభిమానుల ఫోన్లు ఎప్పుడూ ఆన్ లోనే ఉంటాయి. అలాంటి పబ్లిక్ ప్లేసుల్లో జరిగే రహస్యాలు కేవలం గీతా మాధురికే ఎలా తెలిశాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. “మీడియా వాళ్లు, వేల మంది జనం తిరిగే చోట ఆమె ఒక్కరికే తెలిసే రహస్యాలు ఉంటాయా?” అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఆమె అరుదుగా వెళ్తానని చెబుతూనే, అంత పెద్ద బాంబు పేల్చడం కొంచెం అతిశయోక్తిగా ఉందని విమర్శలు వస్తున్నాయి.సోషల్ మీడియాలో గీత వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇది కేవలం ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాట అని కొందరు కొట్టిపారేస్తున్నారు.
సెలబ్రిటీ హోదాలో ఉండి ఇతరుల వ్యక్తిగత సంబంధాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా? అని పెదవి విరుస్తున్నారు.సిటీలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా నిమిషాల్లో వార్త బయటకు వచ్చే కాలం ఇది. అలాంటప్పుడు “నేను చెబితేనే బయటపడుతుంది” అనడం కాస్త ‘ఓవర్ స్టేట్‌మెంట్’ లానే అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి గీతా మాధురి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ కి, చర్చలకి దారితీశాయి. సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న వ్యాఖ్య కూడా ప్రజల్లో ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. గీతా మాధురి వెనుక ఉన్న ఆ ‘రహస్య జంటలు’ ఎవరో కానీ, ఆమె కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి!