టీవీ: బిగ్ బాస్ -8 ఫైనల్ ఎపిసోడ్ ఎంతమంది చూశారంటే..?

Divya
బిగ్ బాస్ సీజన్ -8 పూర్తి అవ్వడం ఇటీవల జరిగింది. విన్నర్ గా నిఖిల్ కూడా నిలిచారు.. బిగ్బాస్ 8 లాస్ట్ వీకెండ్ సండే ఎపిసోడ్ ని చాలామంది వీక్షించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఒక విషయాన్ని తెలియజేసిందట.. బిగ్ బాస్ -8 సీజన్ టీవీలో కంటే ఎక్కువగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలోనే చాలామంది వీక్షించినట్లుగా తెలియజేశారు. ఈ సీజన్ ని ఎక్కువగా ఓటీటీ యాప్ లోనే చాలామంది చూసినట్లుగా తెలుపుతున్నారు. అది కూడా రికార్డు స్థాయిలో చివరి ఎపిసోడ్ వీక్షించినట్లు తెలిపారు.

బిగ్ బాస్ 8 ఫైనల్ ఎపిసోడ్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏకంగా 23 మిలియన్స్ మంది చూశారట. అంటే సుమారుగా 2 బిలియన్ యూస్  బిగ్ బాస్ తెలుగు హిస్టరీ లోనే ఇది సూపర్ రికార్డ్ అని తెలియజేస్తున్నారు. బిగ్బాస్ 8 కూడ బాగానే ఆకట్టుకుంది.105 రోజులు కంటెస్టెంట్స్ తమ ఆటతో మెప్పించారు. అయితే ఈ సీజన్ టైటిల్ రేసులో సైతం గౌతం కృష్ణ నిఖిల్ మధ్య ఫైనల్ వరకు చాలా పోటాపోటీ గాని జరిగింది. కానీ చివరికి ఆడియన్స్ నిఖిల్ కే ఓటు వేశారు. టాప్-2లో గౌతం కృష్ణ నిలిచారు.

అయితే ఈసారి సీజన్లో తెలుగు వర్సెస్ కన్నడ ఆడియన్స్ మధ్య అనవసరమైన చర్చలు కూడా జరిగాయి. కన్నడ నటుడు తెలుగు బిగ్ బాస్ గెలవడం ఏంటి అంటే చాలామంది దారుణంగా బిగ్ బాస్ నిర్వాహకులను కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే నటుడుగా కన్నడ సిని పరిశ్రమను వదిలి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిఖిల్ ఇక్కడే స్థిరపడాలనుకుంటున్న వారిని వేరు చేయడం కరెక్ట్ కాదని మరికొంతమంది బిగ్ బాస్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఆటతీరుతో గెలుస్తారని భాషను బట్టి కాదని మరి కొంతమంది తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: