వాట్... అటువంటి వ్యక్తులు కూడా డయాబెటిస్ బారిన పడతారా..?

lakhmi saranya
భారతదేశంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్ద అనే లేకుండా డయాబెటిస్ భారీనా పడుతున్నారు. క్రమంలో ఓ పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. స్థూలకాయలు మాత్రమే కాదు, సన్నగా ఉన్నవారు కూడా టైప్ 2 మధుమేహ బాదితులుగా మారవచ్చునని... వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి... చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు.. అయితే... మధుమేహం గురించి చాలా విషయాలు వ్యాప్తి చెందుతుంటాయి. ఈ వ్యాధి ఉబకాయం ఉన్న వారిలో మాత్రమే వస్తుందని చాలామంది నమ్ముతారు.
 అయితే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇటీవల నిర్వహించిన ఓ ఆధ్యాయనం ఈ భావన తప్పని రుజువు చేసింది. సాధారణ బరువు ఉబకాయం టైప్ 2 మధుమేహం మధ్య సంబంధం ఆధారంగా పరిశోధనలో ఇది వెల్లడైంది. కరణ బరువు ఊబకాయం అంటే వ్యక్తి సాధారణ శరీర ద్రవ్యరాశి సూచిక కలిగి ఉంటాడు... కానీ వారి శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం... ఆరోగ్యవంతమైన వ్యక్తి BMI 18.5 నుంచి 24.9 మధ్య ఉంటుంది. అయినప్పటికీ, NWO ఉన్న వ్యక్తులు పురుషులకు 25%, స్త్రీలలో 32% కంటే ఎక్కువ శరీరా కొవ్వును కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఇది ఊబకాయం వర్గంలో ఉంటుంది.
ఈ అధ్యాయనం అహ్మదాబాద్ లోని ఎంపీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించారు. ఇక్కడ టైప్ 2 మధుమేహం ఉన్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 432 మందిపై నిర్వహించిన ఈ అధ్యాయనంలో 33% మందిలో సాధారణ బరువు ఊబకాయం లక్షణాలు కనిపించాయి. సాధారణ BMI ఉన్న 91% మంది పురుషులు, 51.8% మంది స్త్రీలు అధిక శరీర కొవ్వును కలిగి ఉన్నారు. NWO లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు అధిక కార్డియోమెటబోలిక్ ప్రమాదాన్ని కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. రాండమ్ బ్లడ్ గ్లూకోస్ స్థాయిలు, సిస్టోలిక్, డయస్టోలిక్ రక్తపోటు, అధిక రక్తపోటు లక్షణాలు ఈ వ్యక్తులలో ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. తక్కువ బరువు ఉన్న వారిలో కూడా శరీరా కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: