కాస్త ఓపిక పట్టండి...ఓజీ చిత్ర యూనిట్ సంచలన పోస్ట్!
పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' సినిమాను rrr ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా నియమితులవ్వడంతో కొంచెం బిజీ అయిపోయారు. ఇక దీంతో పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించిన OG సినిమా గురించి అభిమానులు అరవడంతో తాజాగా డివివి సంస్థ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ విడుదల చేసింది. 'OG సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానం, ప్రేమ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం పని చేస్తున్నాం. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సభలకు వెళ్లినప్పుడు, సమయం, సందర్భం చూడకుండా OG OG అని అరవడం, వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదు. వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఆ స్థానాన్ని, స్థాయిని గౌరవించడం మన కనీస బాధ్యత. అందుకని ఇంకొన్ని రోజులు ఓపికగా ఉందాం. 2025- OG పండుగ వైభవంగా నిలుస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం.' అంటూ రాసుకొచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.