వాటర్ తాగడం వల్ల నిజంగానే కొవ్వు కరుగుతుందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

lakhmi saranya
తిండి లేకపోయినా బ్రతకచ్చు కానీ... నీరు లేకపోతే మాత్రం బతకలేం. మీరు శరీరానికి చాలా ముఖ్యం. నీటిని సరిగ్గా తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మంచి నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోకుండా ఉంటుంది. అధికరువు తగ్గాలన్న, ఊబకాయం తగ్గాలంటే, శరీరంలో వ్యర్ధ పదార్థాలు బయటకు పోవాలన్నా, కరగాలన్నా వాటర్ ఫాస్టింగ్ చెయ్యాలని అంటారు. మరి నిజంగానే మంచినీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ పోతాయా?
మంచినీళ్లతో ఈ సమస్యల నుంచి బయట పడొచ్చా అనే అనుమానం చాలామందిలో ఉండే ఉంటుంది. సాధారణంగా కొవ్వు రెండు రకాలు ఉంటుంది. మంచి కొవ్వు ... చెడు కొవ్వు .. మంచి పువ్వు ఆరోగ్యాన్ని పెంచితే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ను కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. లేదంటే డయాబెటిస్, గుండె సమస్యలు, అధిక బరువుతో ఇబ్బంది పడటం ఖాయం. అదే సమయంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు.
నీరు సరిగ్గా తాగకపోతే దాని ప్రభావం కొలెస్ట్రాల్ పై ఎఫెక్ట్ పడుతుంది. మరి నీరు తాగటం వల్ల శరీరంలో కొవ్వు ఎలా కరుగుతోందో ఇప్పుడు చూద్దాం. నీటిని ఎక్కువగా తాగటం వల్ల సిరల్లో పేరుకుపోయిన మలినాలు, ఎంత పదార్థాలు తొలగిపోతాయి. లివర్, మూత్రపిండాలు అన్నీ క్లియర్ అవుతాయి. నీటిని ఎక్కువగా తాగటం వల్ల శరీర భాగాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. పదార్థాలు బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉండిపోతే.. యూనిక్ యాసిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులు రావచ్చు. నీటిని ఎక్కువగా తాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగిపోతుంది. రక్తంలో, సిరల్లో, శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు బయటకు వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: