టీవీ: దారుణమైన స్థితిలో కార్తీక దీపం సీరియల్ సీక్వెల్..!

Divya
ఒకప్పుడు బుల్లితెరపై టిఆర్పి రేటింగ్ విషయంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ కార్తీకదీపం ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ సక్సెస్ కావడానికి మౌనిత పాత్ర కూడా చాలా కీలకమని చెప్పవచ్చు. ఇందులో శోభా శెట్టి అద్భుతంగా నటించింది. కానీ కార్తీకదీపం సీరియల్ సక్సెస్ సాధించిన స్థాయిలో సీక్వెల్ మాత్రం మెప్పించలేకపోతోందట. రేటింగ్ పరంగా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని బుల్లితెరవర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

కార్తీకదీపం-2 అభిమానులను సైతం నిరాశ పరిచేల కనిపిస్తోంది. మేకర్స్ ఇప్పటికైనా జాగ్రత్త తీసుకోకపోతే ఈ సీరియల్ పని గోవిందా అంటూ పలువురు అభిమానులు బుల్లితెర ప్రేక్షకులు కూడా తెలియజేస్తున్నారు. కార్తీకదీపం సీరియల్ పేరు వినిపించినంతగా సీక్వెల్ వినిపించలేదు. సీక్వెల్ కూడా భారీ హీట్ అవుతుందనుకున్న అభిమానులకు సైతం నిరాశన మిగిల్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్, నీరూపమ్ ఊహించని స్థాయిలో క్రేజీ ఉన్నప్పటికీ ఆ క్రేజీని సైతం కార్తీకదీపం-2 లో ఉపయోగించుకోలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

కార్తీకదీపం సీక్వెల్ కు డైరెక్టర్ ను మార్చడం కూడా కాస్త మైనస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి..కథ కథనం విషయంలో కూడా చాలా తప్పులు కనిపిస్తున్నాయని నెటిజనుల నుంచి చాలా దారుణమైన ట్రోలింగ్ కూడా జరుగుతోంది .కార్తీకదీపం-2 కి భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా రాలేదని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో నైనా ట్విస్టులతో కూడిన ఎపిసోడ్లు విడుదల చేసి రేటింగ్ పరంగా పుంజుకుంటుందేమో చూడాలి మరి. హిట్ సీరియల్ సీక్వెల్ తీసి పొరపాటు మేకర్స్ చేస్తున్నారేమో అనే అంతగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లోనైనా కార్తీకదీపం-2 సీరియల్ కి ప్రేక్షకాదాలను పెరగాలని అందుకు తగ్గట్టుగా మేకర్స్ ప్లాన్ చేస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం  కార్తీకదీపం-2 సీరియల్ చూసే వారి సంఖ్య తగ్గుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: