హైందవ ధర్మం మీసం మెలేసింది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అఖండ2 సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అందరూ మహానుభావులు కాలేరని ఒక పని కోసం భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటాడని ఈ సినిమా చూసి సనాతన, హైందవ ధర్మం మీసం మెలేసిందని చెప్పుకొచ్చారు. వేదం, మంత్రోఛ్చారణ మన భారతదేశపు మూలాలు అని మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలగలిపిన సినిమా అఖండ అని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో ఒక్కో డైలాగ్ ఒక ఆణిముత్యం అని ప్రతి సీన్ ఒక ఉద్వేగం, ఉత్తేజ ప్రకంపనం అని చెప్పుకొచ్చారు. సినిమా అనేది నిత్యావసర వినోదం అని అందుకే ఇండస్ట్రీ పెద్దలు ఎలాంటి సినిమాలు తీయాలన్న ఆలోచన అవసరం ఉందని బాలయ్య అన్నారు. ఈరోజు నాకు గర్వంగా ఉందని ఇప్పటివరకు ఐదు సినిమాలు తీశామని ఆరోది కూడా రాబోతుందని బాలయ్య చెప్పుకొచ్చారు. చరిత్రలో చాలామంది ఉంటారని బాలయ్య పేర్కొన్నారు. ధర్మం దారిలో నడవాలని అన్యాయం జరిగితే తల దించకూడదని బాలయ్య పేర్కొన్నారు. ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఉంటుందని బాలయ్య పేర్కొన్నారు.
సృష్టించిన చరిత్రను మళ్ళీమళ్ళీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించేవాడు ఒక్కడేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఒక తెలియని శక్తి అని ఎవరిని చూసుకునిరా బాలకృష్ణకు ఇంత పొగరు అని చాలామంది అంటారని నన్ను చూసుకుని నాకు పదునైన పొగరు అని బాలయ్య పేర్కొన్నారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం అని ఆయన తెలిపారు. నన్ను నేను తెలుసుకోవడమే నాకు తెలిసిన గొప్ప విద్య అని ఆయన కామెంట్లు చేశారు. అంతా ఆ పరమేశ్వరుడి దయ అని బాలయ్య అభిప్రాయపడ్డారు.
సినిమా, మ్యూజిక్ ద్వారానే ఉత్సాహం కలుగుతుందని నా వృత్తే నా దైవం అని బాలయ్య చెప్పుకొచ్చారు. ఇది తెలుగు సినిమా మాత్రమే కాదని ప్రపంచ సినిమా అని బాలయ్య కామెంట్లు చేశారు. ఎక్కడ చూసినా యుద్దాలు, ఆకలి చావులని బాలయ్య తెలిపారు. ప్రధాని మోదీ కోసం స్పెషల్ షో వేయనున్నామని బోయపాటి శ్రీను అభిప్రాయపడ్డారు. త్వరలో ఢిల్లీలో అఖండ2 ప్రదర్శన జరగనుందని ఆయన అన్నారు.