లక్షణాలు ఇవే.. విస్తరిస్తున్న డేంజరస్ వైరస్..!
ఈ వైరస్ వల్ల శ్వాసకోస వ్యాధులు కూడా వస్తాయని దీనికి టీకా లేదని తెలియజేస్తున్నారు. HMPV వైరస్ సోకిన వారికి కేవలం లక్షణాలను తగ్గించే విధంగా చికిత్స అందిస్తారని తెలుస్తోంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు మందులు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని, శ్వాస ఇబ్బందులు ఉంటే ఆక్సిజన్ థెరపీ వంటివి ఉపయోగించాలని తెలిపారు. ఈ వైరస్ కొత్తది కాదని 2001లోనే కనుగొనబడినట్లు తెలియజేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఎక్కువగా అమెరికాలో Hmpv కేసులు నమోదు అవుతున్నాయని 2026 ఫిబ్రవరి 1 నాటికి కేసులు భారీగా పెరిగిపోయాయని 3.83 శాతం నుంచి 7.43 శాతానికి పెరిగాయని తెలుపుతున్నారు.
న్యూజెర్సీ వంటి ప్రాంతాలలో కోవిడ్, ఫ్లూ, HMPV, RSV వంటి కేసులు పెరగడంతో అక్కడ ఎమర్జెన్సీ వైద్య సేవలు కోరుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ వ్యాధుల లక్షణాల ఏమిటంటే దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, జ్వరం ,శ్వాస ఆడకపోవడం వంటివి అని అధికారులు తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు ఈ లక్షణాల వల్ల న్యుమోనియాకు కూడా దారి తీయవచ్చని తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ఎక్కువగా శీతాకాలం నుంచి వసంతకాలం వరకు వ్యాపిస్తుందని. ఈ వైరస్ కాల వ్యవధి మూడు నుంచి ఆరు రోజులపాటు ఉంటుందని ఎక్కువగా చిన్నపిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే అధిక ప్రభావం చూపిస్తోందని సిడిసి అధికారులు తెలియజేస్తున్నారు.