టీవీకే పార్టీ అధినేత విజయ్ కి షాక్.. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు..!
అంతేకాకుండా హీరో విజయ్ రాత్రి 7 గంటలకు ఆలస్యంగా రావడంతో ఒక్కసారిగా అభిమానులు విజయ్ ను చూడడానికి దూసుకు రావడంతో ఈ విషాదం జరిగింది. సుమారుగా 9 మంది చిన్నారులు 18 మంది మహిళలతో సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. హీరో విజయ్ ఇప్పటికే ఈ విషయం పైన జనవరి 12, 19వ తేదీన రెండుసార్లు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా విజయ్, తొక్కిసలాట ఘటనకు టీవీకే పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పరిస్థితి చేయి దాటి పోతుందని ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని సిబిఐ కి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ కేసులోని అటు టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సి ఆనంద్ ను కూడా అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలోని మార్చి 10వ తేదీన విజయ్ సిబిఐ కార్యాలయానికి హాజరవుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవైపు రాజకీయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ ఆటు కుటుంబ సమస్యలతో కూడా మరికొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భార్య సంగీత విడాకులు కోరడంతో సంచలనంగా మారింది. అంతేకాకుండా హీరోయిన్ త్రిష తో కలిసి తిరుగుతూ ఉండడం వల్ల అటు పొలిటికల్ పరంగా సినీ సెలబ్రెటీలు కూడా చాలామంది విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాలన్నిటికీ కూడా విజయ్ కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.