"అలా ఉండే ప్రేమను వెతుక్కోండి".. పెళ్లి తరువాత రష్మిక సెన్సేషనల్ పోస్ట్..!
పెళ్లి అనంతరం సోషల్ మీడియాలో ఒక నెటిజన్ రాసిన ప్రత్యేకమైన నోట్ ని నటి రష్మికను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. ఆ ఆర్టికల్‌లో నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఎంతో అందంగా వివరించారు. ముఖ్యంగా ‘‘నిజమైన ప్రేమ అనేది ఒకరినొకరు గౌరవించుకోవడంలోనే ఉంటుంది. పరస్పరం ఎదుగుదలకు సహకరించుకునే బంధమే నిజమైన ప్రేమ’’ అని ఆ నెటిజన్ పేర్కొన్నారు. ఈ మాటలు చదివిన రష్మిక చాలా ఎమోషనల్ అయ్యారు.ఆ పోస్టుపై స్పందిస్తూ రష్మిక తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘నా గురించి ఇప్పటివరకు చాలా మంది ఎన్నో రకాలుగా రాశారు. కానీ ఈ నోట్ చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేనిది. నా మనసులో చెప్పాలనిపించే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ క్షణంలో అవి మాటలుగా బయటకు రావడం లేదు’’ అని ఆమె పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం తన జీవితంలో జరుగుతున్న భావోద్వేగ ప్రయాణాన్ని కూడా రష్మిక వెల్లడించారు. ‘‘ఇప్పుడిప్పుడే నేను నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని మరింతగా అర్థం చేసుకునే ప్రయాణంలో ఉన్నాను. నా స్వంత ప్రపంచాన్ని తెలుసుకునే ఒక అందమైన దశలో ఉన్నాను. ఆ ప్రయాణాన్ని గుర్తించి ఇంత ప్రేమగా రాసినందుకు ధన్యవాదాలు’’ అని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా ప్రేమ గురించి కూడా రష్మిక ఒక అద్భుతమైన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆమె చెప్పిన మాటలు ఎంతో మందికి ఆలోచన కలిగించేలా ఉన్నాయి. ‘‘ప్రేమ అనేది ఎప్పుడూ ఒకరిని బంధించేందుకు కాదు. నిజమైన ప్రేమ అంటే ఒకరికి ఒకరు స్వేచ్ఛ ఇవ్వడం, పరస్పరం ఎదుగుదలకు ప్రోత్సహించడం. మనల్ని అర్థం చేసుకుని, మన కలలను గౌరవించే వ్యక్తిని జీవితంలో కనుగొనడం ఎంతో ముఖ్యమైనది’’ అని ఆమె తెలిపారు.
రష్మిక చెప్పిన ఈ సందేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రేమ అంటే స్వాధీనం చేసుకోవడం కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం అనే భావాన్ని ఆమె ఎంతో స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ మాటలు అభిమానుల హృదయాలను తాకాయి. చాలామంది ఆమె ఆలోచనలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇలా తమ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటకు అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రపంచం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ జంట తమ కెరీర్‌లో కూడా మరింత విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.