రాత్రిపూట వాచ్మెన్ గా పనిచేసిన జబర్దస్త్ నటుడు..!!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తాగుబోతు రమేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గుతూ ఉండడంతో జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మారి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈ కమెడియన్ తెలియజేసిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొదటిసారిగా జగడం సినిమాతో తన కేరియర్ ని మొదలుపెట్టారు తాగుబోతు రమేష్.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తాగుబోతు రమేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. తాగుబోతు రమేష్ మాట్లాడుతూ తన జీవితంలో తను బతకడానికి ఆటోలు లారీలు జీపులను నడిపానని సినిమా ఇండస్ట్రీలోకి రావడం అంటే అంత సులువైన విషయం కాదని.. హైదరాబాద్ కి వచ్చిన మొదట్లో రాత్రి సమయాలలో చాలా అపార్ట్మెంట్ల దగ్గర సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేశానని పగటిపూట ఆఫీసుల చుట్టూ ఫోటోలు పట్టుకొని తిరిగానని తెలియజేశారు. జగడం సినిమా అవకాశం రావడంతో తన కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని తెలిపారు.

తాగుబోతు రమేష్ ఈ స్థాయిలో రావడానికి చాలా కష్టాలను ఎదుర్కొన్నానని ఎమోషనల్ అవుతూ తెలియజేశారు. సినిమాలలో అవకాశాలు తగ్గిన తాగుబోతు రమేష్ కామెడీ కి మాత్రం అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. రమేష్ కు సరైన పాత్రలు వచ్చాయి అంటే చాలు పూర్వ వైభవాన్ని సైతం సులువుగా సంపాదించుకుంటారని ఆయన అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఒకే తరహా పాత్రలలో నటించడం వల్ల తాగుబోతు రమేష్ కెరియర్ కు కాస్త మైనస్ గా మారింది. తన కామెడీ టైమింగ్ తో మరింత మెప్పించిన తాగుబోతు రమేష్.. ఈగ సినిమాలో కూడా రెండు మూడు సన్నివేశాలలో నటించి మరింత క్రేజ్ అందుకున్నారు. అయితే తాగుబోతు రమేష్ చెప్పిన విషయాలను చూసి పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: