"పుష్ప 2" ఐటమ్ సాంగ్ లో ఎన్టీఆర్ బ్యూటీ..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో సమంత ఐటెం సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఐటెం సాంగ్ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 సినిమా తెరకెక్కుతోంది. దానితో మొదటి నుండి కూడా ఈ సినిమాలో ఎవరు ఐటమ్ సాంగ్ లో నటిస్తారు అనే ఆసక్తి జనాలలో నెలకొంది. దానితో ఇప్పటికే అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. పుష్ప 2 లో పలానా బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేయబోతోంది.

పలానా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది అని అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ మూవీ యూనిట్ ఇంత వరకు ఎవరు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు అనే దాన్ని తెలియజేయలేదు. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఐటమ్ సాంగ్ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేయలేదు. దానితో తాజాగా మరో ముద్దుగుమ్మ పేరు ఏ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగినటువంటి కియార అద్వాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

ఈమె ఇప్పటికే భరత్ అనే నేను , వినయ విధేయ రామ అనే తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ , హృతిక్ హీరోలుగా రూపొందుతున్న వార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఇక ఈ ముద్దుగుమ్మ పుష్ప 2 లో  ఐటెం సాంగ్ చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: