ఆ హీరోలకు ఇబ్బందిగా మారిన పుష్ప 2 వాయిదా?

Purushottham Vinay
టాలీవుడ్ లో సంక్రాంతి పండుగ తర్వాత ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదన్న సంగతి తెలిసిందే. వేసవిలో రిలీజ్ అవ్వాల్సి ఉన్న రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉండగా అక్టోబర్ కు వాయిదా వేశారు. రీసెంట్ గా సెప్టెంబర్ నెలకు మళ్లీ ప్రీ పోన్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా ఎన్నికల వల్ల మే నుంచి జూన్ కు పోస్ట్ పోన్ చేశారు.దీంతో 2024 సెకండాఫ్ లోనే పెద్ద సినిమాలన్ని వరుసగా రిలీజ్ కానున్నాయి. మొదటి కల్కి మూవీతో స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత పుష్ప-2, ఓజీ, దేవర, గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రానున్నాయి. మధ్యలో కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు ఇండియన్-2, వేట్టయాన్ కూడా రిలీజ్ అవ్వనున్నాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు షెడ్యూల్ అయిపోవడంతో.. మిడ్ రేంజ్ హీరోలంతా కూడా సేఫ్ డేట్ చూసుకుని తమ చిత్రాలతో రావడానికి రెడీ అయిపోయారు.కానీ ఇంతలో సీన్ అనేది రివర్స్ అయిపోయింది. ఓజీ సినిమా ఫిక్స్ అయిన డేట్ కు దేవర సినిమా వస్తోంది. పుష్ప-2 షెడ్యూల్ అయిన తేదీకి డబుల్ ఇస్మార్ట్ సినిమా వస్తోంది. దీంతో ఓజీ ఇంకా పుష్ప-2 వాయిదా పడతాయని జోరుగా చర్చ సాగుతోంది. పవన్ ఓజీ సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు వస్తుండగా.. అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా మాత్రం క్రిస్మస్, లాంగ్ వీకెండ్ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుందని సమాచారం వినిపిస్తోంది.


అదే కనుక నిజమైతే.. నాగ చైతన్య నటిస్తున్న తండేల్ మూవీతో పాటు నితిన్ రాబిన్ హుడ్ మూవీల మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఎందుకంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ రెండు సినిమాలను డిసెంబర్ 20వ తేదీన విడుదల చేయాలని  మేకర్స్ ఆలోచిస్తున్నారు. కానీ పుష్ప-2 సినిమా అప్పుడే రిలీజ్ అయితే రెండూ తప్పుకోవాలి.అయితే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఒకటి గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తుండగా.. మరొకటి మైత్రీ వాళ్లు నిర్మిస్తున్నారు. కానీ మళ్లీ కొత్త డేట్స్ వెత్కుకోవడమే చాలా పెద్ద టాస్క్. అలా అని పుష్ప-2 సినిమా ఆగస్టులోనే వచ్చేస్తే.. ఆ రెండు సినిమాలు కూడా సేఫ్ అనుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ డిసెంబర్ లో విడుదలవుతుందని తెలుస్తుంది. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఏం  ప్రభాస్ సలార్ మూవీ సడెన్ గా పోస్ట్ పోన్ అయింది. దీంతో అప్పటికే డిసెంబర్ నెలలో షెడ్యూల్ అయి ఉన్న చాలా సినిమాల వసూళ్లు భారీగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోవాలని మేకర్స్ కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మున్ముందు మరేం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: