పరిటాల సునీత: సునీతమ్మ ఆశలపై నీళ్లు చల్లిన బాబూ..!

Divya
•పయ్యావుల కేశవ కు న్యాయం చేయడానికే
•సునీతమ్మకు అందుకే మంత్రి పదవి ఇవ్వలేదు
•బాబు నిర్ణయం సరైనదే

(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )
పరిటాల సునీత.. రాప్తాడు కంచుకోటగా మారడానికి కారణం పరిటాల రవి అని చెప్పాలి.. ఆయన ప్రజలకు చేసిన సేవే రాప్తాడు ప్రజలు నేటికీ వారిని గుర్తు పెట్టుకున్నారు. అందుకే తరాలు మారిన రాప్తాడు ఎక్కువ శాతం టిడిపి కేవశం అవుతోంది. పెనుగొండ శాసనసభ నియోజకవర్గం నుండి 2005లో ఒకసారి శాసన సభ్యురాలుగా ఎంపికైన ఈమె ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయింది. అయితే ఈసారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ ఎన్నో అంచనాలు వేసుకున్నారు. కానీ ఊహించని విధంగా కొత్తవారికి మంత్రి పదవి ఇవ్వడంతో సీనియర్ నేతలంతా కాస్త బంగపడ్డారని చెప్పాలి.

ఇకపోతే 2014 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి టిడిపి ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత శిశు సంక్షేమం వికలాంగ వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రిగా కూడా పనిచేసిన ఈమెకు ఈసారి కూడా మంత్రి పదవి లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఆశలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీళ్లు చల్లారని చెప్పాలి.. మరి ఈమెకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2014లో రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు సునీతకు మంత్రిగా అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిటాల రవికి మంచి ఇమేజ్ ఉంది. ఆయనపై ప్రజలలో మంచి గుర్తింపు ఉంది.. వారి ఫ్యామిలీకి అన్యాయం చేయకూడదన్న కారణంతోనే నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లపాటు సునీతమ్మకు మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే అదే సమయంలో ఉరవకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పయ్యావుల కేశవ ఓడిపోయారు. ఆయన కూడా సీనియర్ .. అయితే ఇప్పుడు అసలేం జరిగిందనే విషయానికొస్తే 2019 ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి గెలిచిన పయ్యావులకేశవ ఈసారి 2024 ఎన్నికల్లో కూడా గెలుపొందారు. ప్రతిపక్షంలో ఐదేళ్లపాటు గట్టిగా పోరాటం చేశారు సబ్జెక్టుతో పాటు రాజకీయాలపై మంచి అవగాహన కూడా ఉంది. అంతేకాదు ప్రతిపక్షంలో ఉంటూనే ప్రజాబద్ధుల కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కచ్చితంగా ఆర్థిక శాఖ ఇవ్వాలి. 1994 నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న పయ్యావుల కేశవ.. అయితే ఈయన దురదృష్టం ఏమిటంటే పయ్యావుల కేశవ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వం అధికారంలోకి రాదు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయన ఓడిపోతున్నారు. అయితే ఈసారి అలా కాకుండా రెండు సానుకూలంగా జరిగాయి. అందుకే లాస్ట్ టైం సునీతకు న్యాయం చేశారు కాబట్టి. ఈసారి పరిటాల సునీతకు ఇవ్వకుండా పయ్యావుల కేశవకు మంత్రి పదవి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: