ఆగిపోయిన అల్లు అర్జున్ రెండు సినిమాలు... ఎందుకో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
ఎంతో మంది హీరోలు మొదట కథ నచ్చి సినిమాకు టైం ఉండడంతో మూవీ ని ఓకే చేసుకొని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలు ఆగిపోయినవి ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ కూడా తన కెరీర్ లో రెండు మూవీలను ఆల్మోస్ట్ మొదలు పెట్టి ఆపేశాడు. ఆ మూవీలు ఏవి అనే విషయాలను తెలుసుకుందాం. అల్లు అర్జున్ కొంతకాలం క్రితం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ అనే ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానితో దర్శకుడు, నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులను కూడా ప్రారంభించారు.

అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఐకాన్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని జనాలు అంతా ఫిక్స్ అయ్యారు. అలాంటి సమయంలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ ఆగిపోయింది. ఇక ప్రస్తుతం కూడా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు కూడా ఏమీ రావడం లేదు. ఇక అల్లు అర్జున్ కొంత కాలం క్రితం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దానితో ఈ మూవీ బృందం వారు ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దానితో అల్లు అర్జున్, కొరటాల కాంబోలో ఓ భారీ మూవీ రాబోతుంది అని ప్రేక్షకులు అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఈ సినిమా ఆగిపోయింది. దాని తర్వాత అల్లు అర్జున్ తన సినిమాలతో తను బిజీగా ఉంటే, కొరటాల తన సినిమాలతో తన బిజీ అయ్యారు. ఈ మూవీ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ రెండు సినిమాలు ఇకపై ఉండే అవకాశాలు కూడా కష్టంగానే కనబడుతున్నాయి. ఇలా అల్లు అర్జున్ ఆల్మోస్ట్ కమిట్ అయిన ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: