టీవీ: క్షీణించిన పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు..!

Divya
జబర్దస్త్ లో తన వరుస పంచులతో , కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్న పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కిరాక్ ఆర్పితోపాటు పలువురు ఆయనకు సహాయాన్ని అందిస్తామని ముందుకు వచ్చారు అయినా సరే ఇప్పుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు డయాలసిస్ చికిత్స చేయించుకున్నా కూడా సమస్య సాల్వ్ కాలేదు. దీంతో రోజు రోజుకూ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో పరిస్థితి మరింత విషమంగా మారింది అని.. చికిత్సకు డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో నూకరాజు పోస్ట్ చేస్తూ వీలైనంత త్వరగా పంచ్ ప్రసాద్ కు ఆపరేషన్ చేయాలని అందుకు చాలా ఖర్చవుతుందని దాతలు ఎవరైనా సహాయం చేయాలి అంటూ ఒక వీడియో రూపం లో వెల్లడించారు. ఇక నూకరాజు మాట్లాడుతూ.. పంచ్ ప్రసాద్ అన్న  ఆరోగ్యం లో ఇప్పుడు ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఎన్నో హాస్పిటల్ కి తిరగాల్సి వచ్చింది అయినా ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు.  గత మూడు సంవత్సరాల క్రితమే ఆయన రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయితే అప్పటినుంచి ఆయన చాలా బాధ భరిస్తున్నాడు. ఈ కిడ్నీ సమస్య ఉన్నవారికి ఒకదాని వెనుక ఒకటి జబ్బులు వస్తూనే ఉంటాయి కాబట్టి ఆయనకు కూడా ఇదే జరుగుతోంది.
ఇక వీలైనంత త్వరగా పంచ్ ప్రసాద్ అన్నకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించాలని వైద్యులు చెప్పారు లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని దానికి లక్షల్లో ఖర్చు అవుతుందని ఎవరైనా ఆయనకి సహాయం చేయండి అంటూ చేతులెత్తి మరి వేడుకున్నారు. ఇందులో పంచ్ ప్రసాద్ ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: