కాన్ఫిడెంట్ చిరంజీవి కానీ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిందా..?
సినిమాను వాయిదా వేయడానికి ముఖ్య కారణం విజువల్ ఎఫెక్ట్స్ (VFX). సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉన్న కారణంగా, వాటి నాణ్యత విషయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివిటీ రాకుండా ఉండేందుకు మేకర్స్ మరింత శ్రద్ధగా గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు. ఈ చిత్రం అడ్వెంచర్ కథతో విజువల్ ఫీస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని యూనిట్ భావిస్తోంది.చిరంజీవి మరో సినిమా 'మన శంకర వరప్రసాద్' సంక్రాంతికి విడుదల కానుంది. అయితే, అంతకుముందే ఎప్పుడో మొదలైన 'విశ్వంభర'కు కనీసం మినిమం బజ్ కూడా రాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 'విశ్వంభర'పై కామన్ ఆడియన్స్ కాదు కదా, మెగా ఫ్యాన్స్ కూడా అంత ఆసక్తిగా లేరనే పరిస్థితి కనిపిస్తోంది. సినిమా గ్లింప్స్ విడుదల చేసినా దానికి నామమాత్రంగానే స్పందన వచ్చింది.అయినప్పటికీ, ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని తెలుస్తోంది.
వేసవిలో రిలీజ్ ఉన్నా, ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ బయటకు రావడం లేదు. అయితే, ఈ పరిస్థితిని మార్చడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.సినిమా కథను హింట్ ఇస్తూ త్వరలో ఒక టీజర్ విడుదల చేయనున్నారట. అది సినిమాపై అంచనాలు పెంచేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.'విశ్వంభర' బజ్‌ను పెంచి, ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేలా మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను భారీ స్థాయిలో నిర్వహించాల్సి ఉంది. చిరంజీవి 'మన శంకర వరప్రసాద్' రిలీజ్ అయిన తర్వాత 'విశ్వంభర' ప్రమోషన్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది.మెగాస్టార్ చిరంజీవి, త్రిషల కాంబోలో, కీరవాణి సంగీతంతో వస్తున్న 'విశ్వంభర' ఒక విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించాలని చూస్తోంది. అయితే, ఈ సినిమాపై మెగా అభిమానుల్లో, కామన్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేందుకు మేకర్స్ త్వరగా ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది.