ఒక్క పోస్టుతో హాట్ టాపిక్ గా మారిన మెహరీన్ పెళ్లి..బిగ్ ట్విస్ట్ ఎవరు ఊహించలేదుగా..?
రెండేళ్ల నుంచి సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈసారి ఈ వేధింపులు హద్దులు దాటాయని ఇప్పుడు నిజం చెప్పక తప్పడం లేదంటూ తెలిపింది.. ఈ పోస్టులో మెహరీన్ చాలా క్లారిటీగా ఒక విషయాన్ని అయితే తెలియజేసింది.. తాను ఇప్పటివరకు ఎవరిని వివాహం చేసుకోలేదని, భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా తన అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేస్తానంటూ హామీ ఇచ్చింది. ఒక నీచుడు నా వికీపీడియాని హ్యాక్ చేసి మరి రెండు నిమిషాల పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది.
ఎవరు కూడా ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు, అలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వ్యక్తి ఇక తనను జర్నలిస్టుగా చెప్పుకోకూడదని ఘాటుగానే విమర్శలు చేసింది. తన పర్సనల్ లైఫ్ గురించి ఇలా ఎడిట్ చేయడానికి ఆపాలని, తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ చెక్ పెట్టింది. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా కొన్ని ఊహాగానాలు తన వ్యక్తిగత విషయం పైన తప్పుడు వార్తలు రాస్తూ కొన్ని ఎడిట్లు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.