టీవీ: స్టేజ్ పైనే శేఖర్ మాస్టర్ పరువు తీసిన సుమ..!

Divya
బుల్లితెర మహారాణిగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళీ ముద్దుగుమ్మ తెలుగులో యాంకర్ గా స్థిరపడి తెలుగు బుల్లితెర ఇండస్ట్రీ నే శాసిస్తోంది. బుల్లితెరపై షోలు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఆడియో లాంచ్ లకు కూడా ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తుంది అంతేకాదు పలు సినిమాలకు సంబంధించి హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న సుమ ఏం చేసినా కూడా కొత్తగా ఉంటుందని అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా సుమ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పరువు తీసినట్లు సమాచారం.
ఇకపోతే సుమా కనకాల తాజాగా హోస్ట్ గా చేస్తున్న షో సుమా అడ్డా.  ఈ షో కి ఇప్పటికే కళ్యాణం కమనీయం, వాల్తేర్ వీరయ్య సినిమా టీం తో పాటు వాల్తేరు వీరయ్య టీం కూడా వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా చిరంజీవి ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ అయినా జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ వచ్చి సందడి చేశారు. మంచి డాన్స్ తో మాస్టర్ ఇద్దరు కూడా ఎంట్రీ ఇచ్చాక.సుమ తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపించడం మొదలుపెట్టింది..ఈమధ్య శేఖర్ మాస్టర్ హీరోయిన్లతో ఎక్కువ వర్క్ చేస్తున్నట్లున్నారు అని.. సుమా అనగానే మీరు కూడా హీరోయిన్ కదా అని శేఖర్ మాస్టర్ అన్నాడు .అది గుర్తు చేసుకుందామని ఈ ఏడాది ఒక సినిమా చేశాను అని సుమా అంటే.. చేశారా.. అని పంచవేశాడు శేఖర్ మాస్టర్ .
సుమ షాక్ అయింది ఆ తర్వాతముగ్గురు కలిసి ఒక స్కిట్ చేశారు. భార్యాభర్తలుగా కమెడియన్స్ స్కిట్లు వేయగా పిల్లలు పుట్టలేదని భర్తను తిడుతుంది భార్య.. పక్కింటి వెంకటరావుకు పదిమంది పిల్లలు.. ఒకసారి ఆయన ఖాళీగా ఉంటే అతని దగ్గర టిప్ అడిగి తెలుసుకురా అని భార్య అంటే.. పదిమంది పిల్లలు అంటే ఖాళీగా ఎప్పుడు ఉంటాడే వాడు అని భర్త సమాధానం ఇచ్చాడు .దీంతో శేఖర్ మాస్టర్ నవ్వగా అవునులే ఆయనకిద్దరే కదా అంటూ పంచ్ వేసింది సుమ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: