టీవీ: బతికున్నానని చెప్పడానికే ఆ పని చేస్తున్న బిగ్ బాస్ దీప్తి..!!

Divya
దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే ఇమే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపరీ చితురాలు అయింది. ముఖ్యంగా డబ్స్మాష్ వీడియోలు ద్వారా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఏమే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెలబ్రేట్ హోదాను అందుకుందని చెప్పవచ్చు. అంతేకాకుండా బిగ్ బాస్ షో లో కూడా అవకాశాన్ని అందుకొని మరింత పాపులర్ అయింది. కేవలం దుబ్స్ మ్యాచ్ వీడియోల ద్వారానే కాకుండా యూట్యూబ్ ఛానల్ లో పలు షార్ట్ ఫిలిం లలో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది.
వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది .ఈ ముద్దుగుమ్మ మరో యూట్యూబ్ ఛానల్ లో ఫేమస్ అయిన షణ్ముఖ  తో కొంతకాలం ప్రేమాయణం నడపగ ఆ తర్వాత షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్నప్పుడు అతని ప్రవర్తన నచ్చకపోవడంతో అతనికి బ్రేకప్ చెప్పేసింది.సోషల్ మీడియాలో మాత్రం దీప్తి సునయన ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో మరింత ఎక్కువ గా కనిపిస్తూ ఉన్నది. చాలావరకు సోషల్ మీడియా ద్వారా తన బ్రేకప్ మూడ్ నుంచి బయటపడేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది అనే వార్తలు ఈమధ్య బాగా వినిపిస్తున్నాయి.
ఖాళీగా సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో బాగా హడావిడి చేస్తోందని ఆమె సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల ఒక షార్ట్ ఫిలిం లో నటించగా అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఆమె సొంతంగా ఒక ఇల్లు కొనుక్కున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఫోటోలను వీడియోలను షేర్ చేసింది. అప్పుడప్పుడు షణ్ముఖను ఉద్దేశిస్తూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇక నేటిజన్లతో చిట్ చాట్ నిర్వహించినప్పుడు ఒక నెటిజన్ రోజు మీరు స్టోరీలో ఒక ఫోటో అయినా పెడతారు ఎందుకు అని అడగగా.. దీప్తి దీనికి నేను బ్రతికి ఉన్నాను అని తెలపడానికి ఇది సమాధానమని తెలిపింది. దీంతో కామెంట్స్ చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: