ఎట్టకేలకు.. తన భర్త ఎవరో చెప్పేసిన ఇలియానా?

praveen
హీరోయిన్ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఈ ముద్దుగుమ్మ. దేవదాస్ అనే సినిమాతో  ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో జోడి కట్టిన ఈ సొగసరి.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఇక తన నడుమొంపు అందాలతో కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి. మొదటి సినిమాను సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది ఇలియానా.

 ఇక ఈ అమ్మడి కొంటె చూపులకు కుర్ర కారు డమాల్ అంటూ ఇక ఈమెతో ప్రేమలో పడిపోయారు. ఇక పగటి కలల్లో మునిగిపోయారు అని చెప్పాలి. ఇలా దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసిన ఇలియానా ఆ తర్వాత ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమైంది. బాలీవుడ్లో అవకాశాల కోసం ట్రై చేసిన అక్కడ అదృష్టం కలిసి రాలేదు. అయితే మధ్యలో ఫిట్నెస్ పై దృష్టి పెట్టకపోవడంతో బాగా లావు అయింది. దీంతో అవకాశాలు కూడా తగ్గాయ్.ఇక రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు కలిసి రాలేదు. అయితే గత కొంతకాలం నుంచి ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కాకుండా ఓ పర్సనల్ విషయంతో వార్తలు తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 అప్పటికే బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లో మునిగిపోయిన ఇలియానా.. ఆ తర్వాత తాను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే భర్త ఎవరో చెప్పకుండానే గత ఏడాది ఆగస్టులో ఈ హీరోయిన్ బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే యూఎస్ వ్యాపారవేత మైకేల్ డోలన్ ను ఇలియానా పెళ్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు తన పెళ్లిపై  స్పందించింది ఇలియానా. భర్తతో తన వైవాహిక జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుందని.. డోలన్ తనకు ఎంతో సపోర్టుగా నిలిచాడని.. కష్ట కాలంలో తనకు తోడుగా ఉన్నాడు అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: