ప్చ్.. మరోసారి సంజూకి నిరాశ తప్పదా?

praveen
జూన్ నెలలో ప్రపంచ కప్ టోర్ని ప్రారంభం కాబోతుంది. వెస్టిండీస్ యుఎస్ వేదికలక ఏఐసిసి టోర్నీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 ప్రపంచ కప్ లో విజేతగా నిలవడమే లక్ష్యంగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయ్. అయితే గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ గెలవడంలో ప్రతిసారి నిరాశ పరుస్తున్న టీమిండియా జట్టు ఇక ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో బలిలోకి దిగడానికి సిద్ధమవుతుంది అని చెప్పాలి.

 అయితే  ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బాగా రాణించిన ప్లేయర్లకి అటు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంతో మంది ప్లేయర్లు అద్భుతంగా రానిస్తున్న నేపథ్యంలో.. పోటీ కూడా తీవ్రస్థాయిలోనే ఉంది. దీంతో ఎవరికి చోటు దక్కుతుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి బాగా రాణిస్తున్న వరల్డ్ కప్ సమయానికి సంజును పక్కన పెడుతూ వస్తున్నారు సెలెక్టర్లు. అయితే ఈసారి అతను కెప్టెన్ గా ఆటగాడిగా కూడా సక్సెస్ అవుతున్నాడు. దీంతో అతనికి వరల్డ్ కప్ లో చోటు దక్కడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు.

 కానీ టీమ్ ఇండియా క్రికెటర్ సంజూకు మరోసారి మొండి చెయ్యి ఎదురయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. t20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే భారత జట్టులో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను తీసుకునేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇక ఇదే నిజమైతే అటు ఇప్పటికే పలు వరల్డ్ కప్ లను మిస్ అయిన సంజూ.. మరో వరల్డ్ కప్ వరకు వేచి చూడక తప్పదు. అయితే కేఎల్ రాహుల్ మాత్రమే కాదు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు కూడా ఇక వరల్డ్ కప్ లో చోటు కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో  ఎవరికి చోటు దక్కుతుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: