"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "ది ఫ్యామిలీ స్టార్"..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించగా , గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కలెక్షన్ లు మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు నుండి భారీగా తగ్గుతూ వచ్చాయి. చివరకు ఈ సినిమాకు భారీ ప్రి బిజినెస్ జరగడం , ఈ మూవీ కి నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు భారీ నష్టాలే వచ్చాయి. ఇలా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్  లోకి ఇచ్చింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను ఈ రోజు నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ భాషల్లో చేస్తున్నారు. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ ఆయన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ సినిమా అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: