ఒక్క రోజులోనే రైల్వే స్టేషన్.. ఈ వరల్డ్ రికార్డ్ ఎక్కడో తెలుసా..?

Divya
డ్రాగన్ దేశమైనా చైనా సరికొత్త ఆవిష్కరణలకు పెట్టింది పేరు.. ఇప్పటికే హైటెక్నాలజీతో ఎన్నో కనుగొన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా హై స్పీడ్ రైల్ నెట్వర్క్ లను పూర్తి చేయడంలో ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో విమానంతో పోటీపడే రైలు సైతం తయారు చేసింది చైనా. కానీ ఇప్పుడు ఏకంగా ఒక్క రోజులోనే ఏకంగా రైల్వే స్టేషన్ ని తయారు చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది. వాటి గురించి చూద్దాం


చైనా కరోనా సమయంలో కేవలం ఒక్కరోజులోనే ఆసుపత్రి పూర్తి చేసింది. అది కూడా 48 గంటలలో ఒక పెద్ద ఆసుపత్రిని కట్టడమే కాకుండా, అందులో లక్ష మంది వరకు రోగులు ఉండేలా నిర్మించింది.  ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు మిషనరీ ని కూడా భారీగానే సద్వినియోగం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ మ్యాన్యువల్ రిసోర్స్ అనేది తగ్గిపోయింది. అక్కడ ఇంటికి ఒకరిని మాత్రమే కనాలి అనే కాన్సెప్ట్ వల్ల అక్కడ జనాలు కూడా తగ్గిపోయారు.



ఇప్పుడు అక్కడ మిషనరీ ప్రభావం ఎక్కువగా ఉంది? ఆ  మిషనరీ ప్రభావం వల్ల మనుషుల చేత పనిని తగ్గించి, యంత్ర సామాగ్రిని అత్యధికంగా ఉపయోగిస్తున్నారు చైనా. చైనా చెబుతున్నటువంటి తాజా లెక్కల ప్రకారం, ఒక రైల్వే స్టేషన్ మొత్తాన్ని ఒక్క రోజులో నిర్మాణాన్ని పూర్తి చేసిందట చైనా. అది కూడా ఒక రికార్డు సృష్టించడం కోసమే చేశామంటూ తెలియజేస్తోంది. అది కూడా 9 గంటలలోనే 1500 మంది వర్కర్స్ ని పెట్టి మరి ఇదంతా కూడా పూర్తి చేశామంటూ లెక్క చెబుతున్నారు. ఇందుకోసం 7 ట్రైన్లు, 23 కన్స్ట్రక్షన్ వెహికల్స్ తో చైనాలో ఉండే  ఫ్యూజో సిటీలో ఈ రైల్వే స్టేషన్ ని 9 గంటలకే పూర్తి చేసామనే విషయాన్ని ఆయా సంస్థలు హైలైట్ చేస్తున్నాయి. ఇది చైనా యొక్క గొప్పతనం అంటూ చాలామంది నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: