రాంచీలో చిక్కుకున్నా.. రూ.600 ఫోన్ పే చేయమన్న ధోని?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతూ ఏకంగా అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండియన్ క్రికెట్ లో ఎంతమంది లెజెండ్స్ ఉన్నా ధోని మాత్రం ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇకపోతే కేవలం బెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కాకుండా బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ బ్యాట్స్మెన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు ధోని. ధోని అందరి క్రికెటర్ల లాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కానీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది.


 ఇక 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఇక ఈసారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోని తప్పుకున్న నేపథ్యంలో.. ఇక ఈసారి ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అందరూ అంచనా వేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ధోని రాంచి లో చిక్కుకున్నాడు అంటూ  సారాంశం ఉన్న వార్త వైరల్ గా మారింది.



 నేను మహేంద్రసింగ్ ధోనిని రాంచీలో చిక్కుకున్న అంటూ ఒక వ్యక్తి మోసానికి యత్నించాడు. మహేంద్ర సింగ్ ఇంస్టాగ్రామ్ ఖాతా పేరుతో.. పర్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఫోన్ పే ద్వారా 600 రూపాయలు ఉంటే పంపండి. బస్సు ఎక్కి ఇంటికి వెళ్తాను. తర్వాత మీ డబ్బు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అంటూ అతను ఒక నెటిజన్ కు మెసేజ్ చేశాడు. దానికి నేను నిజంగా ధోని అంటూ ఒక సెల్ఫీ ని సైతం జత చేశాడు. అయితే సదరు నెటిజన్ మాత్రం ఇది మోసం అని వెంటనే గ్రహించాడు. అయితే తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. కాగా ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడేందుకు  ఎప్పటికప్పుడు కొత్తదారులను వెతుకుతున్నారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: