షూటింగ్లో ఆ హీరోని కొట్టడానికి భయమేసింది : మృనాల్

praveen
మృనాల్ ఠాగూర్.. ఈ అమ్మడు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో అయితే ఇండస్ట్రీలో కాస్త గట్టిగానే ఈ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. సీతారామం అనే సినిమాతో సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకున్న మృనాల్ ఠాగూర్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా ఎదిగింది అన్న విషయం తెలిసిందే. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది దర్శకులకు ఈ ముద్దుగుమ్మ మొదటి ఆప్షన్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది మృనాల్ ఠాగూర్.

 మొన్నటికి మొన్న అటు న్యాచురల్ స్టార్ నాని సరసన హాయ్ నాన్న అనే సినిమాలో నటించిన మృనాల్ ఠాగూర్  మంచి విజయాలు సొంతం చేసుకుంది. అదే సమయంలో ఇక ఇటీవల విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే మూవీలో నటించి.. తన అంతం అభినయంతో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ హీరోయిన్. అయితే నాని హీరోగా నటించిన జెర్సీ మూవీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ సరసన నటించి సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది మృనాల్ ఠాగూర్.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం అభిమానతో పంచుకుంది. షూటింగ్లో భాగంగా తన అభిమాన హీరో షాహిద్ కపూర్ ను కొట్టాలంటే తనకు ఎంతగానో భయమేసింది అంటూ మృనాల్ ఠాగూర్ చెప్పుకొచ్చింది. జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి నటించా. నేను ఆయనకు వీరాభిమానిని. తొలిరోజు షూట్లో ఆయననే చూస్తూ ఉండిపోయాను. అయితే ఒక రోజు షూటింగ్లో ఆయనను కొట్టే సన్నివేశం ఉంటుంది. దీంతో ఆయనను కొట్టడానికి ఎంతగానో భయపడిపోయాను. ఆ సమయంలో మీ మాజీ బాయ్ ఫ్రెండ్ ని గుర్తుతెచ్చుకొని నన్ను కొట్టండి అంటూ షాహిద్ కపూర్ నాకు చెప్పాడు అంటూ మృనాల్ ఠాగూర్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: