తొడ కొట్టినా ..మీసాలు మెలివేసినా..అఖండ 2 విషయంలో జరిగేది ఇదే..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక్క మాట—అఖండ 2. ఇంకొద్ది గంటల్లోనే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందనే ఇంటెన్సిటీతో, ఎక్కడ చూసినా అదే హడావిడి కొనసాగుతోంది. బాలయ్య తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ అన్న భావన ఫ్యాన్స్‌లో ఎంత ఎక్కువగా ఉందో, ఇప్పుడు ఆ హైప్‌ను ఆన్‌లైన్‌లో స్పష్టంగా చూడొచ్చు. మొదటగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడం, కొంతమంది అడ్డంకులు సృష్టించడం, మళ్లీ కొత్తగా సరికొత్త ప్రయత్నాలతో సినిమా రిలీజ్‌కి మార్గం సుగమం చేయడం—ఈ మొత్తం జర్నీని చూసిన అభిమానులు ఇప్పుడు పూర్తిగా ఎగ్జైట్ అయిపోయారు. మేకర్స్ కూడా అన్ని అడ్డంకులను దాటుకుని, ప్రతి స్టెప్‌ని జాగ్రత్తగా వేస్తూ, చివరకు సినిమా తన సమయానికి థియేటర్లలో నిలబెట్టడంలో విజయం సాధించారు.



ఇలాంటి క్రూషియల్ మోమెంట్‌లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న కమెంట్లు మాత్రం వేరే లెవెల్‌లో వైరల్ అవుతున్నాయి. “తొడకొట్టిన మీసాలు మెలివేసినా బాలయ్యని ఎవరూ ఆపలేరు”, “ఎంతమంది అడ్డం వచ్చినా ఇండస్ట్రీని ఈసారి దబిడి దిబిడి చేసేస్తాడు”, “మీసాలు ఒక్కసారి మెలివేసాడు అంటే స్క్రీన్‌ షేక్ అవుతుందిలే బాస్!” అంటూ ఫ్యాన్స్ తమదైన మాస్ స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. అయితే చాలామంది  బాలయ్య స్క్రీన్‌పై మీసాలు మెలివేసే ప్రతి సీన్‌ను సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు బాలయ్య సినిమా వేళ్ల మేము మీసాలు మెలివేయడానికి సిద్ధంగా ఉన్నం అంటూ పోస్టులు చేస్తున్నారు. “అవి కేవలం మీసాలు కావు… పవర్‌కి సింబల్… ఆ మెలివేసే కిక్‌ను సరదాగా కాదు, థియేటర్‌లో ఎంజాయ్ చేయాలి” అంటూ సినిమాటిక్ డైలాగ్‌లా కామెంట్లు పెడుతున్నారు.



అఖండ 2 రిలీజ్‌కి ఇంకా కొద్దిగంటలే ఉండడంతో, ఫ్యాన్స్ ఎమోషన్, హైప్, మాస్ వైబ్అన్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసుకుంటే, బాలయ్య మళ్లీ ఒకసారి థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: