అప్పుడు ప్రగ్యా..ఇప్పుడు సంయుక్తా..అఖండ విషయంలో అదే రూట్ లో ముందుకి..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో ఇదొకటి. అఖండ 2 రిలీజ్ ముంగిట, సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అఖండ సినిమాలో నటించిన ప్రగ్యా జైశ్వాల్‌ గుర్తుండే ఉంటుంది. ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, బాలయ్య పక్కన కనిపించిన కెమిస్ట్రీ—ఇవన్నీ ప్రేక్షకుల మనసుల్లో ఇంకా తాజాగా నిలిచే అంశాలే.బాలయ్య పక్కన హీరోయిన్స్ పెద్దగా సూట్ అవ్వడం అరుదే. కానీ ప్రగ్యా మాత్రం ఆ గ్యాప్‌ను పూర్తిగా ఫిల్ చేసింది. ఆమె పాత్ర, నటన, వెంటనే కలిసిపోయే ఆన్-స్క్రీన్ ఎమోషన్… ఇవన్నీ కలిసి అఖండ సినిమా హిట్ కావడానికి ఒక ప్రధాన కారణంగా నిలిచాయి. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ప్రగ్యా చాలా పద్ధతిగా, ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయకుండా, తనకు ఎదురైన కఠినమైన ప్రశ్నలను కూడా ఓర్పుగా ఎదుర్కొంటూ, సినిమాకి కావాల్సిన పాజిటివ్ వైబ్స్‌ను తీసుకొచ్చింది. ఆమె అప్రోచ్‌ని అప్పుడే చాలామంది ప్రశంసించారు.



ఇప్పుడు అదే రీతిలో అఖండ 2 విషయంలో సంయుక్తా మీనన్‌ వ్యవహరిస్తోందని సోషల్ మీడియాలో అభిమానులు చెబుతున్నారు.ఈ సీక్వెల్‌లో సంయుక్తా హీరోయిన్గా నటిస్తోంది. బాలయ్య – సంయుక్తా జోడీ కూడా థియేటర్స్‌లో అదిరిపోతుందనే అంచనాలు భారీగా పెరిగాయి. గత పది రోజులుగా అఖండ 2పై ఎన్నో రూమర్స్, వివిధ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నా… వాటి మీద ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా, సంయుక్తా పూర్తిగా తన పనిపైనే ఫోకస్ చేస్తోంది. ప్రమోషన్స్‌లోనూ ఆమె చాలా గ్రేస్‌ఫుల్‌గా, ఎలాంటి నెగిటివ్‌ పాయింట్‌ కూడా బయటకు రానీయకుండా, సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని సరైన రీతిలో క్రియేట్ చేస్తోంది.



ప్రగ్యా ఎప్పుడో చేసిన విధంగానే, ఇప్పుడు సంయుక్తా కూడా అదే స్టైల్ ఫాలో అవుతోందని అభిమానులు చెబుతున్నారు. అలా అఖండ సినిమా విషయంలో వీరిద్దరూ తమ తమ టైంలో సినిమా ఇమేజ్‌ పెంచడానికి చేసిన కృషిని గుర్తుచేస్తూ, “ప్రజ్ఞా – సంయుక్తా ఇద్దరూ నిజంగా శభాష్ చెప్పుకోదగ్గ పని చేశారు” అని నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.అఖండ 2 విడుదలకు ముందే ఇలాంటి పాజిటివ్ బజ్ రావడం, సినిమాలో ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. మొత్తానికి, హీరోయిన్ల గ్రేస్, వారి ప్రమోషనల్ స్ట్రాటజీ, బాలయ్యతో ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ—అన్నీ అఖండ 2 మరో భారీ హిట్ అవుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: