అఖండ 2 హిట్ అవ్వాలని బోయపాటి అలాంటి పని.. ఇండస్ట్రీ ప్రముఖులు షాక్..!

Thota Jaya Madhuri
ఇప్పటి పరిస్థితి చూస్తే, సోషల్ మీడియాలో కానీ, సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడ చూసినా ఒక్కటే పేరు మారుమ్రోగిపోతూ ఉంది. అదే – ‘అఖండ’. బాలయ్య హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లోనే కాదు, ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అసాధారణ స్థాయిలో హైప్ నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్, ప్రతి చిన్న రూమర్ కూడా సోషల్ మీడియాలో హీట్ రేపుతోంది. బోయపాటి – బాలయ్య కాంబినేషన్ ఇక ఏ స్థాయిలో అంచనాలు సెట్ చేస్తుందో అందరికీ తెలుసు. వారి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఈసారి మరింత పెద్ద హిట్ కచ్చితంగా రావాలనే ధీమాలో ఉన్నారు. అదే తరహాలో, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. .



డిసెంబర్ 5వ తేదీకి రిలీజ్ కావాల్సిన సినిమాను కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న వార్తలు భగ్గుమన్నాయి. కానీ ఇప్పుడు అన్ని అవాంతరాలు తొలగిపోయి, ‘అఖండ 2’ రిలీజ్ అవ్వడానికి పూర్తిగా సెట్ అయింది. అయితే మరిన్ని సమస్యలు రాకుండా ఉండేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని, అదే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.అవాంతరాలు లేకుండా, సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, బోయపాటి శ్రీను పూర్తి 24 గంటల పాటు కటిక ఉపవాసం ఉండబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా కేవలం ఉపవాసమే కాదు – ఒక చుక్క నీళ్లూ తాకకుండా, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నారట. ఇప్పటివరకు బోయపాటి తన ఏ సినిమాకైనా ఇలాంటి ఆధ్యాత్మిక దీక్ష తీసుకోలేదని, ఇది ‘అఖండ’ సినిమా పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేకమైన భావోద్వేగం, అంకితభావాన్ని చూపుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.



ఈ విషయం తెలిసిన అభిమానులు షాక్ అయ్యేంతగా స్పందిస్తున్నారు. "బోయపాటి ఇంత వరకు ఎప్పుడు ఇలా చేయలేదు… అంటే ఈ సినిమా ఆయనకు ఎంత ప్రాముఖ్యత కలిగివుంటుందో అర్థమవుతుంది" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. దీని పై అధికారిక ప్రకటన ఇప్పటికీ రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తుఫానులా వైరల్ అవుతోంది.మొత్తానికి, ‘అక్కడ’ సినిమా రిలీజ్‌కి ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ, దాని చుట్టూ క్రియేట్ అవుతున్న హడావిడి మాత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టే ప్రాజెక్ట్ రాబోతుందనే సంకేతాలు ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: