"మల్లెమాల" చేస్తున్న ఆ షో కి రేటింగ్స్ ఢమాల్ ?
అయితే మొదట్లో టాప్ రేటింగ్స్ ను అందుకుని ప్రేక్షకాదరణ పొందిన ఈ షో కి ఇపుడు దారుణంగా రేటింగ్స్ పడిపోయి డౌన్ ఫాల్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అసలేం జరిగింది టాప్ లో ఉన్న ఈ ప్రోగ్రాం సడెన్ గా ఎందుకు పడిపోయింది అంటే.. ఇది సంగతి అని వినిపిస్తోంది. అదేనండి సుడిగాలి సుదీర్ లేకపోవడమే వలనే ఈ షో కి ఆదరణ తగ్గింది అని అంటున్నారు. మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కి సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా..ఈ మధ్య మల్లెమాల ప్రొడక్షన్ కు సుదీర్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈటీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం నుండి కూడా సుడిగాలి సుదీర్ బయటకు వచ్చేశాడు.
కాగా దాంతో బ్యూటిఫుల్ లేడీ యాంకర్ రష్మి ని రంగం లోకి దింపింది ఆ షో నిర్మాణ సంస్థ. మొదట్లో రేటింగ్ బాగానే ఉన్నా... గత కొద్ది రోజులుగా పెద్దగా రేటింగ్ నమోదు కావడం లేదని తెలుస్తోంది. సుదీర్ యాంకరింగ్ కి బాగా అలవాటు పడ్డ జనం ఇపుడు షో లో సుదీర్ లేకపోవడం తో బాగా నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే షోకి రేటింగ్స్ కూడా బాగా తగ్గాయని టాక్. దాంతో మల్లెమాల వారు షో కి పూర్వ వైభవం తెచ్చేందుకు సరికొత్త సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.