టీవీ: బిగ్ బాస్ ఆఫర్ పై నోరు విప్పిన చలాకి చంటి..!!

Divya
బుల్లితెర రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నది. ఇక మంచి రేటింగ్ తో కూడా బాగా అలరిస్తూ ఉన్నది ఈ షో ని ఆదరించే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఇప్పటివరకు కొంతమంది పేర్లు బాగానే ప్రచారంలోకి వినిపించాయి. అలా ప్రచారంలోకి వచ్చిన పేర్లలో చలాకి చంటి మోహన్ భోగరాజు పేర్లు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ షోలో పాల్గొనడం లేదని మోహన్ భోగరాజు ఇదివరకే క్లారిటీ ఇవ్వడం జరిగింది.
అయితే చలాకి చంటి మాత్రం బిగ్ బాస్ లో పాల్గొనడం గురించి కాస్త వెరైటీగా స్పందించారు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఈ షో పై మరింత అంచనాలు పెంచేస్తూ ఉన్నాయి. బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ షో వస్తుందంటే చాలు ఎక్కువగా బుల్లితెరకే పరిమితమవుతూ ఉన్నారు ప్రేక్షకులు. ఇక చలాకి చంటి మాట్లాడుతూ.. బిగ్ బాస్ టీం తో ఇప్పటికే చర్చలు కూడా అయిపోయాయని తెలియజేశారు అయితే రెండు విషయాలు మాత్రం మిగిలిపోయాయని తెలియజేశారు చంటి.

ఆ రెండు విషయాలు తెలిస్తే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తానని చంటి తెలియజేయడం జరిగింది మరి చలాకీ చంటి విధించిన ఆ షరతులకు బిగ్ బాస్ బృందం అంగీకరిస్తుందా లేదా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. మరొకవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో కూడా ఎంతమంది బిగ్ బాస్ షోలో పాల్గొంటారు చూడాలి. ఇక ఈసారి కూడా నాగార్జుననే బిగ్ బాస్ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలపై ఇతర హీరోలు ఆసక్తి చూపించకపోవడంతో నాగార్జునని హోస్టుగా కొనసాగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: