కొబ్బరికాయతో నీటి జాడ కనుగొనొచ్చా.. ఇందులో నిజమెంతో తెలుసా?
అయితే ఇలా బోర్ వేసేందుకు ఒక వ్యక్తి వచ్చి పాయింట్ చూసినప్పుడు అక్కడ కొన్ని కొన్ని సార్లు ఇక ఊహించిన దాని కంటే ఎక్కువ నీళ్లు పడటం జరుగుతుంది. ఇంకొన్నిసార్లు మాత్రం బోర్లలో నీళ్లు పడక రైతులకు నష్టాలే మిగులుతూ ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం ఎవ్వరికి తెలియదు. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నీటి జాడను తెలుసుకోవడానికి ఇలాంటి సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఎవరు కూడా జియాలజిస్టులను పిలిపించి నీటి జాడలను కనుగొనలని అనుకోవట్లేదు. అయితే జియాలజిస్టులను పిలిచి మరీ ఎక్కువ ఖర్చు పెట్టెంత స్తోమత కూడా ఎవరికీ ఉండడం లేదు.
నీటి జాడ కోసం కొబ్బరికాయ లేదా చెంబులో నీళ్లు పట్టుకోవడం, వై ఆకారంలో ఉండే వేప పుల్ల ఇలాంటివి ఉపయోగిస్తారు. అయితే శాస్త్రీయ పద్ధతుల ద్వారా కూడా నీళ్ల జాడను తెలుసుకోవచ్చట. నీళ్లు పుష్కలంగా ఉండే ప్రాంతాల్లో ఏ పద్ధతులు పాటించిన బోర్ వేస్తే నిలపడతాయి. అదే కరువు నేల అయితే ఇలాంటి పద్ధతులు తలకిందులు అవుతాయి శాస్త్రీయ పద్ధతులు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు జియాలజిస్టులు అంచనాలు కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఈ కొబ్బరికాయల మంత్రం నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో ఫలించే అవకాశాలు ఉన్నాయట. అక్కడ నీరు కొబ్బరికాయతో కాదు నార్మల్గా కళ్ళు మూసుకొని చెప్పిన కూడా అక్కడ నీరు పడుతుంది. అదే కొబ్బరికాయ నీరు లేని చోట అడిగితే.. ప్రతి చోట ఇలాంటి రిజల్ట్ వస్తే అప్పుడు నమ్మవచ్చు అంటారు ప్రజలు.