సంచలన నిర్ణయం తీసుకున్న సిరి హన్మంత్... ?
హౌజ్ లో జరిగిన ఈ తంతు చూసి వీరి వ్యక్తి గత జీవితం డిస్ట్రబ్ అయిన విషయం తెలిసిందే. అయితే రవి పుణ్యమా అని సిరి, శ్రీహాన్ లు ఒకటయ్యారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు సిరి ఒక స్టెప్ ముందుకు వేసి ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ యంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇపుడు పెళ్లికి రెడీ అయినట్లు సమాచారం. షన్నుతో ఫ్రెండ్షిప్ తో వచ్చిన మనస్పర్ధలు మళ్ళీ తలెత్తకూడదని అలాంటి అపార్థాలకు ఇక చోటివ్వకూడదని సిరి ఇలా నిర్ణయం తీసుకుని శ్రీహన్ ను కూడా ఒప్పించినట్లు అంటున్నారు.
మొదట్లో కెరియర్ పై దృష్టి పెట్టిన ఈ జంట ఇపుడు పెళ్లి చేసుకుని కూడా తమ కెరియర్ కి ఏమాత్రం ఆటంకం కలుగకుండా ఉండేలా ప్లాన్ చేసుకునే ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే వీరి పెళ్లి శుభ వార్త మనకు చెప్పనున్నారు అని టాక్. ఇక షణ్ముఖ్ మరియు దీప్తి సునైనా ల వ్యవహారం బ్రేక్ అప్ వరకు వచ్చింది. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.