బిగ్ బాస్ సీజన్-5 కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. హౌస్ లో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో పాటు గొడవలు కొట్లాటలు కూడా ఫుల్ గా జరుగుతున్నాయి. ఇక ఈ సారి బిగ్ బాస్ సీజన్-5 లోకి టీవీ నటీనటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రెటీలు, సినిమా నటీనటులు ఎంట్రీ ఇచ్చారు. వారిలో అర్జున్ రెడ్డి సినిమా నటి లహరి కూడా ఉన్నారు. లహరి అర్జున్ రెడ్డి సినిమాలో నర్సు పాత్రలో కనిపించి అలరించారు. పాత్ర నిడివి తక్కువగా ఉన్నా లహరిని చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లహరి కూడా లేడీ అర్జున్ రెడ్డిలాగే ప్రవర్తిస్తున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. దానికి కారణం లహరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి చిర్రు బుర్రలాడుతూనే ఉన్నారు. ప్రతి విషయానికి లహరి ఫైర్ అవుతుండటంతోనే ప్రేక్షకులు లహరికి లేడీ అర్జున్ రెడ్డి అంటూ నామకరణం చేశారు.
బిగ్ బాస్ లో రేడియో జాకీ ఆర్ జే కాజల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ జే కాజల్ బిగ్ బాస్ అంటే తనకు ఎంతో ఇష్టమని చిన్నప్పటి నుండి బిగ్ బాస్ చూస్తూ పెరిగానని చెప్పడం...కాస్త ఎక్కువగా స్పందించడంతో లహరి కాజల్ పై ఫైర్ అయ్యారు. ఎందుకు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారంటూ మండి పడ్డారు. దాంతో కాజల్ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఇక ఆ తరవాత లహరికి హమీదా కు మధ్య గొడవ జరింగింది. వారిద్దరి మధ్య కూడా ఎలాంటి కారణం లేకుండానే గొడవ జరింగింది. మొన్న వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా ఆ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.
నిన్నటి ఎపిసోడ్ లో కూడా హమిదా లహరి మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో హమీద సైలెంట్ గా కనిపిస్తున్నా లహరి మాత్రం ఊరుకోవడం లేదు. గట్టిగా అరుస్తూ అమిదా పై ఫైర్ అయ్యింది. దాంతో హమిదా నా ఇష్టం నేను అలానే సమాధానం ఇస్తా అంటూ ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోయింది దాంతో దాంతో లహరి నే మళ్ళీ ఏడవటం మొదలు పెట్టింది. దాంతో తానే అరిచి తానే ఏడుస్తుంది అన్న భావన ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఇక లహరి యాంగ్రీ మేనేజ్ చూసిన ప్రేక్షకులు అర్జున్ రెడ్డి నటి లేడీ అర్జున్ రెడ్డి లా చేస్తుంది అంటూ మండిపడుతున్నారు. అంతే కాకుండా లేడీ అర్జున్ రెడ్డి అంటూ లహరి పై ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి.