బిగ్ బాస్ 5: గేమ్ స్టార్ట్.... జెస్సీది వ్యూహమా ?

VAMSI
బిగ్ బాస్ ప్రారంభం అయ్యి కేవలం రెండు రోజులే అయింది. అప్పుడే ఇంటిలో లుకలుకలు మొదలయ్యాయి. అసలు నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో అసలు విషయం ఏమీ లేకుండానే రచ్చ రచ్చ చేశారు. అయితే అందరూ ఏకాభిప్రాయం లాగా జస్వంత్ ను టార్గెట్ చేసినట్లుగా చూస్తున్న ప్రేక్షకులకు అనిపించింది. ముఖ్యంగా నిన్న జరిగిన నామినేషన్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తున్నారు. ఏ విధంగా బిహేవ్ చేసినా అల్టిమేట్ గా వారి లక్ష్యం ఒక్కటే. మనల్ని చూస్తున్న ప్రేక్షకుల దృష్టిలో మంచి వారిగా ముద్ర వేసుకోవాలి అనే సంకల్పమే ప్రతి ఒక్కరిలో కనిపించింది.
అయితే ఇది ఎంత వరకు సబబు అన్నది వారికి వారే ఆలోచించుకోవలసి ఉంది. ఫమీదా తో మొదలైన వివాదం జస్వంత్ ఏడుపు దగ్గర ఆగింది. ఒక రియాలిటీ షో లో ఒక అబ్బాయి ఒక చిన్న కారణానికి కుమిలి కుమిలి ఏడవడం అనేది కరెక్టా? ఇది నిజమేనా వాస్తవంగా అక్కడ ఏమీ జరగలేదు. జస్ట్ నామినేషన్ చేశారు అంతే వాటిని ఇంకా పాజిటివ్ గా తీసుకునే కోపం అనే ఒక్క బలహీనతను తీసుకుని తర్వాత దానిని కూడా తగ్గించుకోవలసింది పోయి, అలా కోట్ల మంది ప్రేక్షకులు చూస్తుండగా ఏడవడం అనేది జీర్ణించుకోలేక పోతున్నారు.
అయితే జస్వంత్ చేసింది కరెక్టేనా అనే కోణంలో ప్రేక్షకులు ఆలోచించే పరిస్థితి ఉంది. జస్వంత్ వైఖరి చూస్తుంటే మొదటి వారంలో జరిగిన నామినేషన్ లోనే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రవర్తించినట్లు అనుకుంటున్నారు. అయితే ఈ సెంటిమెంట్ వర్క్ ఔట్ అయ్యేలాగానే ఉంది. తానే కావాలని గేమ్ ప్లే చేస్తున్నాడా లేదా నిజంగా అందరూ ఇతన్ని టార్గెట్ చేసినందుకు అంతగా ఫీలయ్యాడా అన్నది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: