కోపంతో అవినాష్ తమ్ముడి కాలర్ పట్టుకున్న అరియనా.. ఎందుకు..?

P.Nishanth Kumar
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ దేశంలో నే అతి పెద్ద రియాలిటీ షో అన్న విషయం తెలిసిందే.. పలు భాషల్లో వస్తున్న ఈ షో ద్వారా ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు.. టాలీవుడ్ లో కూడా బిగ్ బాస్ షో ఎంతో మంది నటీనటులకు లైఫ్ ని ఇచ్చింది.. చిన్నా చితక ఆర్టిస్ట్ లను కూడా సెలెబ్రిటీల ను చేసేసింది..తెలుగు నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. అయితే నాలుగో సీజన్ పూర్తయి చాల రోజులవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ లు సోషల్ మీడియా లో ఇంకా హల్చల్ చేస్తూనే ఉన్నారు. మోనాల్, అఖిల్ జంట ఓ వైపు హంగామా చేస్తుంటే అరియనా, అవినాష్ ల జంట కూడా మరోవైపు రచ్చ చేస్తున్నారు..

రోజు కలుసుకుంటూ ఆ ఫోటోలు షేర్ చేసుకుంటూ అభిమానులు తమను మర్చిపోకుండా చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న అరియనా బయట కూడా అందరిని అలరిస్తుంది. అయితే హౌస్ లో టెంపర్ గా ఉండే అరియనా బయట తొలి సారి తన టెంపర్ తనాన్ని చూపించింది. అవినాష్ తమ్ముడిని ఏకంగా కాలర్ పట్టుకుని మరీ తన కోపాన్ని ప్రదర్శించింది.

అయితే అది నిజంగా కాదు.. షో లో.. స్టార్ మా కామెడీ స్టార్స్ పేరుతో ఓ కామెడీ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. చమ్మక్ చంద్రతో పాటు మరికొందరు టీమ్ మెంబర్స్ తో ఈ షో నడుస్తుంది.హీరోయిన్ శ్రీదేవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్న ఈ షోలో, ఒక టీం లీడర్ గా అవినాష్ ఉన్నాడు.లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అవినాష్ అతని ఫ్రెండ్ అరియనాను దించాడు. స్కిట్ లో భార్య రోల్ తనకు ఇవ్వడం జరిగింది.రొమాంటిక్ సాంగ్ తో మొదలైన వీరి స్కిట్ మధ్యలో అరియనా నిజ స్వరూపం బయటకు తీసింది. భర్త హోదాలు కాఫీ అడిగిన అవినాష్ మొఖంపై కాఫీ కొట్టింది.ఇక ఇదే టీమ్ లో కమెడియన్ గా చేస్తున్న అవినాష్ తమ్ముడిపై అయితే వీర లెవెల్లో  రెచ్చిపోయింది. అవినాష్ తమ్ముడు అరియనాను అమ్మా అని పిలవడంతో, ఎవడ్రా నీకు అమ్మా... అంటూ అతని కాలర్ పట్టుకొని విదిలించేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: