బుల్లితెరపై మళ్లీ సందడి పెట్టిన సుమ..!

Suma Kallamadi
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది యాంకర్ సుమ. స్టార్ మహిళ’ కార్యక్రమంతో బుల్లితెరపై సంచలనాలను క్రియేట్ చేస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకుంది. అయితే స్టార్ మహిళ ప్రోగానికి ఈటీవి కొంతకాలం విరామం ప్రకటించింది. తాజాగా ఈ షోను మళ్ళి ప్రారంభిస్తున్నారు. అయితే సోమవారం నుంచి బుధవారం వరకూ మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కాబోతున్న ‘స్టార్ మహిళ’ కొత్త ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. పంచ్‌లతో సుమ పొట్టచెక్కలు చేసింది.

ఈ షోకి ఢీ ఛాంపియన్స్ డాన్సర్‌లతో పాటు కొంతమంది యాంకర్లను తీసుకువచ్చిన సుమ వాళ్లతో ఆటాడుకుంటుంది. మొదట కొంతమంది నార్త్ డాన్సర్‌లతో పూల దండలు అల్లిస్తోంది సుమ. ఆ తరవాత కొంతమంది తెలుగు యాంకర్లతో ముగ్గులు వేయించిన ఎపిసోడ్‌లోకి క్లిప్పింగ్స్‌ని కట్ చేశారు. ఇందులో యాంకర్ శ్రీవాణితో పాటు మిగిలిన యాంకర్ ముగ్గుని ఇష్టం వచ్చినట్టుగా పడేస్తుండటంతో.. ‘ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు.. హా!! బ్లీచింగ్ పౌడర్ వేస్తే చాలు అన్నారు కదా నువ్ కూడా చల్లుకో’ పంచ్ వేసింది సుమ. ఇక వాళ్లు ముగ్గులు వేయడానికి స్కేల్, ఎరైజర్‌లు అడగడంతో వాళ్లతో ఓ ఆట ఆడుకుంది సుమ.

అంతేకాదు యాంకర్ వింధ్యా విశాఖ.. పొట్టిగా ఉన్న ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తూ.. ‘ప్రభాస్ అంత ఎత్తులేకపోయినా’ అంటుండగా.. నువ్ ఎత్తుకునేలా ఉన్నాడులే అంటూ మార్క్ పంచ్ విసిరింది సుమ. ఇక నా లవ్ యాక్సెప్ట్ చేయవా అని ఆ పొట్టిగా ఉన్న అబ్బాయిని వింధ్యా అడగ్గా.. సారీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ నో చెప్పాడు. నీక్కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా?? ఎంతమంది ఉన్నార్రా అని సుమ అడగడంతో.. ఇద్దరు ముగ్గురు అని సమాధానం ఇస్తుంది. ‘వీడొక్కడికీ కరోనా వస్తే చాలా ఆ ముగ్గురు బయటకు వచ్చేస్తారు’ అంటూ మరోసారి కరోనా పంచ్ వేసి నవ్వులు పూయించింది సుమ. మొత్తానికి స్టార్ మహిళ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ.. ఒక్కో ఎపిసోడ్‌లోని హైలైట్స్‌ని ప్రోమోగా పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: