"ఖంగుతిన్న" రాజస్థాన్ రాయల్స్..విజయం "సన్‌రైజర్స్‌దే"....

Bhavannarayana Nch

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్‌ లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌  9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.. రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌  కేవలం 15.5 ఓవర్లలోనే సునాయాసం గా గెలుపు సాధించింది..ఈ మ్యాచ్ లో  శిఖర్‌ ధావన్‌..77 నాటౌట్‌; 13ఫోర్లు, 1సిక్స్‌.. హాఫ్‌ సెంచరీ చేయగా  కేన్‌ విలియ‍మ్సన్‌..36 నాటౌట్‌; 3ఫోర్లు,1సిక్స్‌ తో

 

అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగుల తక్కువ స్కోర్ ని చేసిన రాజస్తాన్ ఇన్నింగ్స్‌ను  మొదలు పెట్టిన వెంటనే అజింక్యా రహానే, డీఆర్సీ షార్ట్‌లు ఆరంభించగా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డీ ఆర్సీ షార్ట్‌(4) నిరాశపరిచడంతో రాజస్తాన్‌ ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌ చేయడంతో డీ ఆర్సీ షార్ట్‌ తన వికెట్‌ను కోల్పోయింది..

 

అయితే ఆ వరస వికెట్లు పతన తర్వాత రహానే-సంజూ సామ్సన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను తీసుకుంది...ఈ సమయంలోనే  ఆపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెన్‌ స్టోక్స్‌(5) కూడా పెవిలియన్‌ బాట పట్టడంతో రాజస్తాన్‌ 63 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే సామ్సన్‌(49; 42 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో రాజస్తాన్‌ తిరిగి తేరుకుంది...దాంతో 126 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే రాజస్తాన్‌ నిర్దేశించింది. సన్‌ రైజర్స్‌ బౌలర్లలో సిద్ధార్ధ్‌ కౌల్‌, షకిబుల్‌ హసన్‌ చెరో రెండు వికెట్ల తీసి ఆకట్టుకోగా,  భువనేశ్వర్‌ కుమార్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: