ఏపీ: వై నాట్ కుప్పం.. చంద్రబాబును వైసీపీ మట్టికరిపించబోతుందా..?

Suma Kallamadi
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వై నాట్‌ 175, వై నాట్ కుప్పం అంటూ జగన్ తన లక్ష్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా చెప్పారు. అయితే దానికి తగినట్లుగానే కుప్పంలో ఈసారి చంద్రబాబును కచ్చితంగా తమ ఓడిస్తామని ధీమాలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. తాము అమలు చేసిన ఎలక్షన్ స్ట్రాటజీలో వర్క్ అవుతాయని, చంద్రబాబు ఓటమి ఖాయం అని వైసీపీ నమ్మకంగా ఉంది. నిజం చెప్పాలంటే 2019 అసెంబ్లీ ఎన్నికలలోనే చంద్రబాబు మెజారిటీని వైసీపీ బాగా తగ్గించగలిగింది. వైసీపీ అభ్యర్థిపై బాబు జస్ట్ 30 వేల మెజారిటీతో మాత్రమే గెలవగలిగారు.
ఎంతో అనుభవం ఉంది ఎన్నోసార్లు సీఎం అయ్యి ఉండి కూడా మామూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇలాగా తక్కువ ఓట్లతోనే ఆయన పోయినసారి గెలిచారు. అయితే ఈసారి ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. అధికారంలోకి రాగానే జగన్ చేసిన మొదటి పనుల్లో కుప్పం పై దృష్టి సారించడమే అని చెప్పుకోవచ్చు. కుప్పం ప్రజలను వైసీపీ వైపు ఆకర్షించాలని ఆయన ప్లాన్ చేశారు ఎందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు. ఆయనను తరచుగా కుప్పంలో తిప్పుతూ అక్కడ అభివృద్ధి పనులు చేయించారు. పెద్దిరెడ్డి కి మంచి అనుభవం ఉంది కాబట్టి కుప్పంలో పార్టీని బలోపేతం చేయగలిగారు. దాని ఫలితంగా ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించింది.
 ఈ ఫలితం తర్వాత జగన్ తో పాటు వైసీపీ నేతలకు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఎన్నికలలో టిడిపిని ఓడించినప్పుడు చంద్రబాబుని ఎందుకు ఓడించలేము అనే ఒక ఆలోచన వచ్చింది. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తూ వ్యూహ రచన చేస్తూ వైసీపీ ముందుకు కదిలింది. జోక్ ఏంటంటే కుప్పంలో 35 వేల దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లన్నీ చంద్రబాబుకే పడటం వల్ల ఆయన పోయినసారి గెలిసినట్లు ఉన్నారు. అయితే ఈసారి ఆ ఓట్లు మొత్తం తొలగించడం జరిగింది. అలాగే వైసిపికి అనుకూలంగా ఉండే 15 వేల ఓట్లు అదనంగా చేర్చడం జరిగింది. ఈ అన్ని కారణాలవల్ల కుప్పంలో చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు అనే ధీమాతో అధిష్టానం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: