చిరంజీవికి పెద్ద పదవి.. నోరు జారిన కూతురు..??

Suma Kallamadi
టాలీవుడ్ సీనియర్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం అన్నయ్య చిరంజీవి త్వరలోనే పెద్ద హోదాలో కనిపించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తమ్ముడు భారీ విజయం సాధించాక అన్నయ్య మళ్లీ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. చిరంజీవి కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లో అడుగు పెట్టారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. అందువల్ల ఆయన రాజకీయాల ద్వారా ప్రజలకు చేయాలనుకున్న మంచి చేయలేకపోయారు.
అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్ల చిరుకు రాజకీయాలపై మనసు మళ్లిందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లిలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. దీనిని ప్రధాని మోదీ వంటి రాజకీయ ప్రముఖులతో పాటు రజనీకాంత్, చిరంజీవి కూడా విచ్చేసారు.
అయితే ఈ కార్యక్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై మోదీని తన అన్నయ్య చిరు దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు చిరంజీవి, మోదీ చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. చివరికి ఈ మెగా బ్రదర్స్‌ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు మోదీ. వారి చేతులు పైకెత్తి కలిసి ప్రజలకు నమస్కారం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఈ దృశ్యం చాలా హైలెట్ అయింది.
ఇక అప్పటినుంచి పీఎం నరేంద్ర మోదీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ కచ్చితంగా చేసే ఉంటారు అని సోషల్ మీడియా యూజర్లు చర్చ మొదలుపెట్టారు కొందరైతే ఇదే నిజం అంటూ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత ఈ పుకార్లపై స్పందించింది.
సుస్మిత తన సొంత ప్రొడక్షన్ హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా "పరువు" వెబ్‌సిరీస్ రూపొందించింది. అది రీసెంట్‌గా ZEE5లో రిలీజ్ అయింది. దీని ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చివరికి తన తండ్రికి పొలిటికల్ లైఫ్ గురించి మాట్లాడింది. రాజ్యసభ ఆఫర్ చిరుకి లభించిందా అని అడిగితే రాలేదు అని తెలిపింది. "అలాంటిదేమీ లేదు, అసలు ఆ విషయాలు నాకు తెలియవు." అంటూ చెప్పుకొచ్చింది. మొత్తం మీద క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చేసి తనకు తెలియదు అంటూ సుస్మిత మాట్లాడింది. రాజ్యసభ ఆఫర్ గురించి ఇంతవరకు తమ ఇంట్లో ఎవరూ మాట్లాడుకోలేదని, పవన్ కళ్యాణ్ సాధించిన విజయం గురించి మాట్లాడుకుంటూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: