ఒక్క ఫిర్యాదు ఇవ్వగానే ఫాస్ట్‌గా రెస్పాండ్ అయిన హీరో నిఖిల్.. ప్రశంసల వర్షం..??
నిఖిల్ తన మామ, ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్యను సంప్రదించి, ఆ ప్రాంతంలోని చెత్తను తొలగించడానికి మునిసిపల్ సిబ్బందిని పంపించారు. నిఖిల్ క్విక్ రెస్పాన్స్ ఇచ్చి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. చీరాలలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నిఖిల్ హామీ ఇచ్చారు.
ఇంతకుముందు నిఖిల్ తన మామ ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా చిరాల నియోజకవర్గంలో ఓటర్లతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పుడేమో పువ్వాడవారి వేది ప్రాంతంలో చెత్త పేరుకుపోయిన విషయం గురించి తెలుసుకున్న నిఖిల్, వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించడానికి చర్యలు తీసుకున్నారు. నిఖిల్ తన మామతో మాట్లాడి మునిసిపల్ సిబ్బందిని పంపించి చెత్తను తొలగించారు.
నిఖిల్ ఈ పని చేశాక ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే, నిఖిల్ ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రకటించలేదు. నిఖిల్ ఒక టాలెంటెడ్ యాక్టర్ మాత్రమే కాకుండా, సామాజిక సమస్యల పట్ల స్పృహ కలిగిన పౌరుడు కూడా అని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. తన ప్రజాదరణను సమాజానికి మేలు చేయడానికి ఉపయోగించుకుంటున్న నిఖిల్ చర్యలు అభినందనీయం.తన వృత్తి, కుటుంబం, సమాజం పట్ల నిఖిల్ కలిగి ఉన్న అంకితభావం అభిమానులను ఆకట్టుకుంటుంది. వెండితెరపైనే కాకుండా బయట కూడా నిఖిల్ చేసే మంచి పనులు ఇంకా మరెన్నో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.